జగన్‌పై విచారణ కిరణ్‌కు వరం

YS Jagan-Kiran Kumar Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దర్యాప్తు ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డికి వరంగా మారే అవకాశాలున్నాయి. కాంగ్రెసు అవకాశాలు మెరుగు పడడంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి మారుతుందని అంటున్నారు. జగన్ ఆస్తులపై విచారణలో భాగంగా వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మంత్రులపై కూడా విచారణ జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సీమాంధ్ర, తెలంగాణ సరిహద్దులు చెరిగిపోతాయని అంటున్నారు. సిబిఐ విచారణతో అందరి దృష్టి తెలంగాణ నుంచి మళ్లి రాజకీయ నాయకులు, అధికారులపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైయస్సార్ ప్రభుత్వ హయాంలోని నిర్ణయాల్లో తనకు ఏ విధమైన ప్రమేయం లేకపోవడం తనకు వరంగా మారినట్లు కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన సహాయం కోసం చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు వస్తారని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు ప్రాంతాలవారీగా విడిపోవడాన్ని కూడా కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై దర్యాప్తు పనికి వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెసు నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ, సీమాంధ్ర, జగన్ విధేయులుగా విడిపోయారు దాంతో గత 26 నెలలుగా కాంగ్రెసు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కుంటోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టాల్సి వచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. సిబిఐ విచారణతో జగన్ విధేయులు కూడా వెనక్కి వస్తారని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+