వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనపై జైపాల్ రెడ్డి నిర్ణయమే కీలకం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిది జాతీయ రాజకీయాల్లో విశిష్ట స్థానం. ఇన్నాళ్లు తెలంగాణ అంశంపై గుట్టుగా ఉన్న జైపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తెలంగాణపై కుండబద్దలు కొట్టడం విశేషం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక స్థానంగా మారుతోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు దారి తీస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జైపాల్ వైఖరి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సీనియర్ల వైఖరిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీనిపై సీమాంధ్ర రాజకీయ వర్గాల్లోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ అంశంపై జైపాల్ గతంలో ఎప్పుడూ స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఇప్పుడు అధిష్ఠానానికి సన్నిహితుడైన జైపాల్ తన అభిప్రాయాలు వెల్లడించడంతో అధినాయకత్వంపై ప్రభావం చూపుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా వైఖరితో తెలంగాణ సమస్య పరిష్కారంలో అధిష్ఠానానికి, కాంగ్రెస్ నేతలకూ మధ్య జైపాల్ అనుసంధాన కర్తగా మారారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ వంటి నేతలు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్ వంటి ప్రముఖులు జైపాల్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇటీవల ఈ చర్చలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయనే అంగీకరించారు. ఏపీలోని ఇరు ప్రాంతాల నేతలూ ఢిల్లీలో జైపాల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన సలహాలు స్వీకరించడం ఎన్నాళ్లుగానో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర నేతల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో, పార్టీలో పెద్దల్ని మరో వైపు ప్రభావితం చేసి వారితో మాట్లాడగలిగిన, ఒక రాజకీయ ఫార్ములా దిశగా నడిపించగలిగిన రాజకీయ చతురత జైపాల్‌కే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

జైపాల్ పెద్దరికాన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతోపాటు కొన్ని ఇతర పార్టీల వారూ అంగీకరిస్తున్నారు. తెలంగాణ కోసం కోర్ కమిటీ ఏర్పాటు చేసి, సంధాన కర్తగా జైపాల్ రెడ్డిని నియమించుకుంటామని సీనియర్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. జైపాల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని విహెచ్ అన్నారు. రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర రెడ్డి తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జైపాల్ తప్ప మరొకరు లేరు. తెలంగాణలో కూడా ఆయనే ఆ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా జైపాల్‌నే తమ నాయకుడుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ అత్యధికులు ఇదే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో బీసీలు, దళిత నేతలు ముందున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో జైపాల్ కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా కొత్త సామాజిక సమీకరణలకు దారి తీస్తోంది. ఆయన చొరవను బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలు సైతం ఆమోదిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

English summary
It seems, union minister Jaipal Reddy decision is very important in telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X