వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దిమ్మ తిరిగింది

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల వైఖరితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దిమ్మ తిరిగినట్లే ఉంది. ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. మంత్రి జానా రెడ్డి ఇంటికి వెళ్లి తెలంగాణ ప్రజాప్రతినిధులను ఏకతాటి మీదికి తెచ్చి పెద్దన్న పాత్ర పోషించాలని భావించిన కెసిఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కె. జానారెడ్డి నాయకత్వం వహిస్తుండగా, తెలుగుదేశం ఉద్యమానికి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వం వహిస్తున్నారు. తెరాస చక్రబంధంలో ఇరుక్కున్న తెలంగాణ రాజకీయ జెఎసి కింద పనిచేయడానికి ఆ రెండు పార్టీల తెలంగాణ నాయకులు కూడా ఇష్టపడడం లేదు. ఇంత కాలం తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది కెసిఆర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అయినప్పటికీ మూకుమ్మడి రాజీనామాల ద్వారా తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ముందు వరుసలోకి వచ్చారు.

తెలంగాణలో కెసిఆర్‌ను ఒంటరి చేసి తమ తమ పార్టీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీల నాయకులు పనిచేస్తున్నారు. తెరాస ఏకపక్ష విధానాలను, తెరాస చెప్పుచేతల్లో నడుస్తున్న కోదండరామ్‌ పద్ధతిని వారు వ్యతిరేకిస్తున్నారు. నిష్పక్షపాతంగా, సమిష్టి నిర్ణయాలకు అవకాశం ఇచ్చే కొత్త తెలంగాణ జెఎసిని ఈ రెండు పార్టీల నాయకులు కోరుతున్నారు. తద్వారా తెరాసను పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ రాజీనామా చేసిన నాయకులను తన గొడుగు కింద ఏకం చేయాలనే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనను కాదని అనకుండానే కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

రాజీనామాలు చేసిన వెంటనే తెలుగుదేశం నాయకులు బస్సు యాత్ర చేపట్టి తెలంగాణ పట్ల తాము చిత్తశుద్ధిని ప్రదర్శించామని చెప్పుకుంటూ గత వైభవాన్ని పొందే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ రాజీనామాల ద్వారా తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకున్నామని వారు ప్రజలకు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పర్యటించడం పెద్ద గగనంగా ఉంటూ వచ్చింది. రాజీనామాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాజీనామాలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను తమతో కలుపుకోవడానికి తెరాసనే కాదు, తెలంగాణ జెఎసి కూడా మీనమేషాలు లెక్కించింది. తప్పనిస్థితిలో తెలంగాణ జెఎసి తెలుగుదేశం ప్రాంత శానససభ్యుల రాజీనామాలను ఆహ్వానించింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేత తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటింపజేయాలనే డిమాండు రాజీనామాలతో వెనక్కి పోయింది.

మొత్తం మీద, తెలంగాణ ఉద్యమానికి తామే నాయకులమని చెప్పుకుంటూ వస్తున్నన తెరాసను దెబ్బ తీయడమే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అభిమతంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. కెసిఆర్ ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తున్నారు.

English summary
With the strategy of Telugudesam and Congress Telangana leaders strategy, TRS president K Chandrasekhar Rao is in fix.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X