చిరంజీవికి కిరణ్ కుమార్ రెడ్డి షాక్

బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులను నిర్వహిస్తున్న చిరంజీవి 108 సేవలను నిర్వహించడం తనకు కష్టం కాదని చెబుతూ వచ్చినట్లు సమాచారం. అయితే, తిరిగి జివికెకే ఆ సేవలను అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటికి డబ్బులు చెల్లించకపోవడంతో సేవలు ఆగిపోయాయి కూడా. ఈలోగానే 108 సేవల సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన వల్ల సమయానికి వాహనం రాకపోవడంతో, సకాలంలో వైద్యం అందక రాష్ట్రంలో ఇద్దరు మరణించారు కూడా. అయితే, 108 సేవలను ప్రభుత్వం నిర్వహించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. జివికెకు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు.
108 సేవలను జివికెకు అప్పగించే ఒప్పందం ఇరు పక్షాల మధ్య కుదిరింది. ప్రభుత్వం, జివికె మధ్య ఒప్పందం కుదరడంతో చిరంజీవికి వాటి నిర్వహణ బాధ్యత అప్పగించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇటీవల చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి పనిచేయడానికి చిరంజీవి ఉద్యుక్తుడు కావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి దూరమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications