కోదండరామ్‌కు బంపర్ ఆఫర్?

Kodandaram
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కోదండరామ్‌కురానున్న రాజ్యసభ ఎన్నికల్లో సీటు ఇచ్చి గెలిపిస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హామీ ఇచ్చారనే ప్రచాంర జరుగుతుందంటూ ఓ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.

మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా, లేదా తెలంగాణ సర్వసమ్మత అభ్యర్థిగా కోదండరామ్‌ను నిలబెట్టడంతో పాటు, అన్ని పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో ఆయనను గెలిపిస్తానని కేసీఆర్‌ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి ఎర వేయడం ద్వారా ఆయనను పూర్తి స్థాయిలో తన వైపు మళ్లించుకోవాలన్న ఎత్తుగడతో కేసీఆర్‌ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

అన్ని పార్టీల తెలంగాణ ప్రాంత శానససభ్యులపై ఒత్తిడి తెచ్చి గెలిపిస్తానని హామీ ఇవ్వడంతో ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత విధేయత ప్రకటిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇంతవరకూ కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని విమర్శించకుండా కేవలం టీడీపీనే కోదండరామ్ లక్ష్యంగా చేసుకోవడం వెనుక కేసీఆర్‌ ఆదేశాలు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు టీడీపీ నుంచి కూడా వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ కూడా కోదండరామ్‌పై నిప్పులు చెరిగారు. కోదండరామ్‌ కెసిఆర్ కుటుంబంతో కలసి రింగయ్యారని ఆరోపించారు. తనపై అటు టీడీపీ-ఇటు కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్నా వాటిలో ఏ ఒక్కదానికీ కోదండరామ్ సమాధానం ఇవ్వడం లేదు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇవ్వడం వల్లనే కోదండరామ్ పూర్తిగా తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+