లగడపాటికి హైదరాబాద్‌తో రియల్ లింకులు!

ఆ నివేదికలో హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పేర్కొన్నది. హైదరాబాద్‌లో మౌలిక వసతుల రంగంలోకి పెట్టుబడుల భారీగా వస్తున్నట్టు చెప్పారు. భారతదేశంలోని ఢిల్లీ, బెంగుళూరులకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలోని మంచి చెడ్డలను ప్రస్తావనతో పాటు అందులోని అనేక లోపాలను, సమస్యలను కమిటీ ఎత్తిచూపింది.
అయితే ఈ రంగం అక్కడ రాజకీయ నేతలతో ముడిపడి ఉందని చెప్పింది. పలువురు ఎంపీలకు ఇందులో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నట్టు చెప్పింది. నగరంలో విస్తృతంగా విస్తరించిన ల్యాంకో వ్యాపార సామ్రాజ్యానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిపింది.
ఆర్జీఐఏని నిర్మించిన జిఎమ్మార్ సంస్థ ప్రపంచ పెట్టుబడి సంస్థగా అభివృద్ధి చెందినదని అది కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన వారిదని పేర్కొన్నారు. కేంద్రమంత్రి టి.సుబ్బిరామిరెడ్డికి మరో కన్ట్రక్షన్ కంపెనీతో సంబంధాలున్నాయని, చెప్పింది. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్న ఔటర్ రింగ్ రోడ్డుల గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు సంబంధం ఉన్నట్టు తెలిపింది.
అయితే కొన్ని కంపెనీలు వివాదాస్పద భూములను కూడా వ్యాపారానికి ఉపయోగించి వివాదానికి తెరదీసాయని పేర్కొన్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చింది ఐటీ రంగమని పేర్కొన్నది. ఐటి అభివృద్ధే హైదరాబాద్ రూపురేఖలను మార్చి వేసిందని చెప్పింది. మిగతా మెట్రో నగరాల డెవలపర్స్ హైదరాబాద్‌పై దృష్టి సారించడంతో నగర ప్రమాణాలు పెరిగాయి.
ఇది పరిశ్రమల ఎదుగుదలకు తద్వారా రియల్ ఎస్టేటే వ్యాపారానికి ఊతమిచ్చినదని తెలిపింది. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలపై స్పష్టమైన లెక్కలే లేవని కమిటీ అభిప్రాయపడింది. భూముల బదలాయింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని బట్టి ఈ విషయాన్ని చెప్పవచ్చని చెప్పింది.












Click it and Unblock the Notifications