జూ ఎన్టీఆర్‌కు బాలయ్య కౌంటర్

లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు పాత్రను క్షణక్షణం గుర్తు చేసేలా ఉంటేనే శ్రీరామరాజ్యం పూర్తిగా కొత్త సినిమాలా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో అడుగు పెట్టే సరికే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని స్వర్గీయ ఎన్టీ రామారావు వారసుడిగా పిలిపించుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. మాస్ మసాలా సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో తనకు ఇష్టమైన, తన తండ్రిని తలపించే పౌరాణిక సినిమాలు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తన ప్రణాళికకు అనుగుణంగా బాలకృష్ణ వద్ద కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందులో నర్తనశాల సినిమా ఒక్కటి. చాలా రోజుల క్రితమే దీన్ని తలపెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు ముహూర్త బలం సరిపోవడం లేదు. నర్తనశాలలో ఉత్తరకు నృత్యం నేర్పే సన్నివేశంలో ఎన్టీ రామారావు బృహన్నలగా నటించిన సన్నివేశం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటుంది. నర్తనశాల సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని బాలయ్య అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీరంగంలో ఎన్టీ రామారావు వారసుడిగా ముద్ర వేయించుకుని తెలుగుదేశం పార్టీకి తన వంతు సాయం అందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ వారసత్వ కోరికను దెబ్బ తీయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications