సత్యసాయిగా ప్రకాష్ రాజ్?

రామదాసు, అన్నమయ్య పాత్రలను సమర్థంగా పోషించిన నాగార్జున పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, భక్తుల పాత్రను పోషించి మెప్పించిన అక్కినేని నాగార్జున దేవుడి పాత్రను పోషించగలరా అనే సందేహం వ్యక్తమవుతోంది. విక్రమ్, మురళీమోహన్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వదామన్ బెనర్జీని సత్య సాయి బాబా పాత్రకు ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే దిశలో కూడా ఆలోచనలు సాగుతున్నాయి. చిత్రాన్ని నాలుగైదు భాషల్లో నిర్మిస్తున్నారు. అందువల్ల కొత్తవారిని సత్య సాయి బాబా పాత్రకు తీసుకుంటే మంచిదేమోననే కోణంలో కూడా ఆలోచన సాగుతోంది.
సత్య సాయి బాబా జీవిత చరిత్రపై ఈ సినిమాను సత్యం, శివం, సుందరం అనే దృక్పథానికి అనుగుణంగానే నిర్మించాలని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారు. చిత్రంలో బాబా మహిమలే ప్రధానంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇందుకుగాను గ్రాఫిక్స్ వాడాలని అంటున్నారు. అమ్మోరు, అరుంధతి సినిమాల్లో మాదిరిగా గ్రాఫిక్స్ వాడాలని అనుకుంటున్నారు. సినిమా బడ్జెట్‌కు ఏ విధమైన పరిమితులు లేవని అంటున్నారు. ఖర్చు ఎంతైనా సరే, బాబా భావనలు, ఆదర్శాలు వ్యక్తమయ్యే విధంగా సినిమా ఉంటుంది. కథపై చర్చలు సాగుతున్నాయి. రాజేంద్ర కుమార్ సినిమా స్క్రిప్టును సమకూరుస్తారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాటలు రాయనున్నారు.