రామోజీ రావుతో సోనీ డీల్ వెనక్కి?

ఉన్న ఫళంగా కొన్ని వేల కోట్లు చెల్లించాల్సి వచ్చేసరికి దిక్కుతోచక రామోజీ రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆశ్రయించారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినందుకు రిలయన్స్ సంస్థను నజరానా అడిగిన చంద్రబాబు దాన్ని నిమేష్ కంపెనీ ద్వారా --- డొల్ల కంపెనీల ద్వారా ఈనాడులోకి మళ్లించడంతో రామోజీ ఊపిరి పీల్చుకోగలిగారని ఆ పత్రిక రాసింది. తన గ్రూపులో రామోజీ 40 శాతం వాటాను కంపానీ అండ్ కోకు కట్టబెట్టారని, ఇప్పుడు మార్గదర్శి కేసు తేలకముందే నిమేష్ కంపెనీ ప్రభృతులు వైదొలిగేందుకు వీలుగా దాదాపు 2,400 కోట్లకు తన టీవీ చానెళ్లను రామోజీ రావు అమ్మకానికి పెట్టి భంగపడ్డారని రాసింది.
చానెళ్లను కొనుగోలు చేయబోయిన సోనీ, డీల్‌పై చివరి నిమిషంలో అనుమానాలు వచ్చి వెనక్కి వెళ్లిందని సాక్షి తెలిపింది. రామోజీపై నమోదైన కేసుల్లో రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని నిబంధనల కింద 5,200 కోట్ల జరిమానా, రెండేళ్ల జైలు, ఆదాయం పన్ను కేసులో 2,500 కోట్ల జరిమానా, వెరసి 7,700 కోట్ల జరిమానా కట్టేంత సంక్షోభం ఇప్పుడు వస్తుందని సాక్షి దినపత్రిక రాసింది. ఇంతటి జరిమానా కట్టాలంటే ప్రపంచానికి తెలిసిన రామోజీ ఆస్తి మొత్తం చాలదనే చెప్పాలని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications