వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తరణకు తెలంగాణ అడ్డంకి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగేటట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రత్యేక, సమైక్య వాదాలు మళ్ళీ తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం విస్తరణపై ఒక అడుగు వెనక్కి వేసినట్టేనని తెలుస్తోంది. ఫలితంగా విస్తరణ జరిగితే తమకు బెర్తు ఖాయమనుకున్న వారికి మళ్ళీ నిరాశే ఎదురుకానుంది. శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం కావడంతోపాటు, కెకె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా, అజాద్‌పైనా విమర్శలు గుప్పిం చడంతో మళ్ళీ ప్రత్యేక నిప్పు రాజుకుందని, ఇటువంటి సమయంలో విస్తరణ చేపడితే కొరివితో తలగోకిన చందంగా ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నదని తెలుస్తోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించింది. పిసిసి చీఫ్‌గా బొత్సను ఎంపిక చేయడంతో పాటు సభాపతి, ఉపసభాపతుల నియామకంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవికి దామోదర్‌ రాజనర్సింహ్మాను ఎంపిక చేయడం వంటి అంశాలు చకాచకా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్‌ బొత్స తనదైన శైలిలో పార్టీని పటిష్టపరచుదామనుకున్నప్పటికీ ఆ ఆశలు అడియాశలైనట్టేనా అన్న చర్చ జరుగుతున్నది. కారణం ఇప్పటిదాకా ప్రశాతంగా ఉన్న వాతా వరణం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు

కె చంద్రశేఖరర రావు జానారెడ్డి ఇంటికి పోవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో మళ్లీ తెరపైకి ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్‌ బలంగా వచ్చింది. ఇటువంటి సమయంలో ఇరుప్రాంత నాయకులను సమన్వయ పరచడం బొత్సకు సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక, సమైక్యవాదాలు మళ్ళీ ముందుకు వచ్చిన నేపథ్యంలో విస్తరణ చేపట్టి కొత్త తలనొప్పులు కొని తెచ్చుకోవడం మంచిదికాదని అధిష్ఠానం భావి స్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక అంశంలో మంత్రులు భాగస్వాములు కావడం ముఖ్యమంత్రికి మరీ ఇబ్బందికరంగా మారింది. గ్రేటర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దానం, ముఖేశ్‌, సబితలు మాత్రం ప్రత్యేక సమావేశాలకు దూరంగా ఉండటంతో పాటు ఇతర మంత్రులను తప్పుబడుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో విస్తరణ చేపట్టినా పరిస్ధితుల్లో మార్పురాదని నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రిగా గత ఏడాది బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో తనకు అనుకూలురు కంటే దివంగత వైఎస్‌ హయాంలో మంత్రు లుగా పనిచేసిన వారికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. శాఖల ఎంపికలో మాత్రం సమన్యాయం పాటించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్పట్లోనే బొత్స, ధర్మాన లాంటి సీనియర్లు సిఎంపై విమర్శలు గుప్పించినా అనంతర కాలంలో సర్దు కుపోకతప్పలేదు. గత కొంత కాలంగా కొందరు మంత్రుల పనితీరు బాగా లేక పోవడం, విమర్శలు రావడంతో పాటు ఆశావహులు కూడా విస్తరణపై ఆశలు పెట్టుకోవడంతో పాటు ప్రజారాజ్యం పార్టీకి కొన్ని బెర్తులు కేటాయిస్తారని, దీంతో విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని గతంలోనే కోరారు. ప్రస్తుత పరిస్ధితులను పరిశీలిస్తే కొందరు తెలంగాణ మంత్రులు తమకు పదవులు ముఖ్యం కాదని ప్రత్యేకమే కావాలనడం పట్టుబడుతున్న నేపథ్యంలో విస్తరణ చేయక పోవడమే మంచిదని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, state cabinet reshuffle may postpone by Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X