తెలంగాణ: నరసింహన్ జాక్‌పాట్

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఆయన రెండున్నరేళ్లు పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో రెండున్నరేళ్ల క్రితం రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ను నియమించారు. గవర్నర్‌గా ఆయన పదవీకాలం వచ్చే జనవరితో ముగుస్తుంది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేరుగా పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించింది. రోశయ్య నామమాత్రంగానే ముఖ్యమంత్రిగా ఉన్నారనే ప్రచారం కూడా సాగింది.
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ కమిటీ సభ్యకార్యదర్శిగా తనకు సన్నిహితుడై వికె దుగ్గల్‌ను వేయడంలో నరసింహన్ కీలకపాత్ర పోషించారని అంటారు. శ్రీకృష్ణ కమిటీకి సలహాలు, సూచనలు చేయడంలో ఆయన ప్రధాన భూమిక పోషించినట్లు చెబుతారు. గత రెండున్నరేళ్లలో ఆయనకు రాష్ట్ర పరిస్థితిపై, తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన ఏర్పడింది. తెలంగాణపై ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా సంభవించే పరిణామాలను అదుపు చేయడానికి నరసింహన్ అవసరం చాలా ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కేంద్ర దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఇప్పటికీ గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సకల జనుల సమ్మె నేపథ్యంలో డిజిపి దినేష్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడడం అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఒకవేళ రాష్టపతి పాలన విధించాల్సి వస్తే అనివార్యంగా నరసింహన్‌ను కొనసాగించే పరిస్థితి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications