తారలకు సెకండ్ హ్యాండ్ భర్తలే ముద్దు

Nayantara-Prabhu Deva
సినీ తారలు సెకండ్ హ్యాండ్ మొగుళ్లను పెళ్లి చేసుకునే ఆనవాయితీ దక్షిణాది సినీ రంగానికి కూడా పాకింది. బాలీవుడ్‌లో ఇది అతి సాధారణ విషయంగా మారింది. అయితే, టాలీవుడ్‌లో ఇది తక్కువేనని చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది. అలనాటి మేటి నటి సావిత్రితో ప్రారంభమైన ఈ ధోరణి హీరోయిన్ నయనతార దాకా వ్యాపించింది. నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి విపరీతమైన శ్రమనే తీసుకుంది. ప్రభుదేవా, నయనతారల మధ్య సంబంధంపై ప్రభుదేవా భార్య రమాలత్ రోడ్డు మీదికి వచ్చింది. వారిద్దరిపై కోర్టుకు కూడా ఎక్కింది. అయితే, ప్రభుదేవా రమాలత్‌తో విడాకులు తీసుకుని నయనతారను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. విడాకులకు గాను ప్రభుదేవా రమాలత్‌కు, ఆమె ఇద్దరు పిల్లలకు 30 కోట్ల రూపాయల దాకా చెల్లించాడని, హైదరాబాదు, చెన్నైల్లో ఇళ్లు ఇచ్చాడని చెబుతారు.

కాగా, సావిత్రి అప్పటికే పెళ్లయిన జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా కలిగారు. టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్‌ను కూడా తన అందాలతో ఉర్రూతలూగించిన శ్రీదేవి అప్పటికే పెళ్లయి, పిల్లలున్న దర్శకనిర్మాత బోనీ కపూర్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌తో గౌతమి సహజీవనం చేస్తోంది. ప్రముఖ నటి రాధిక అప్పటికే పెళ్లయి పిల్లలున్న నటుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. రాధిక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా. టీవీ సీరియళ్ల నిర్మాణంలో ఆమెది అందె వేసిన చేయి. సూపర్ స్టార్ కృష్ణ, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల జంట గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి అప్పటికే వారి వారి జీవిత భాగస్వాములతో పిల్లలు కూడా ఉన్నారు.

ఇక, అమల, నాగార్జునల పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. తొలుత నాగార్జున ప్రముఖ నిర్మాత రామానాయుడి కూతురు లక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నాడు. వారి కాపురంలో కలతలు వచ్చాయి. దీంతో ఆయన లక్ష్మితో 1990లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత శివ సినిమాలో తనతో కలిసి నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు. శివ సినిమాతో తెలుగు సినీ రంగంలో ఇద్దరిది హాట్ ఫేవరెట్ జంటగా పేరు పొందింది. ఆ తర్వాత కూడా వారిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దాంతో వారిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగి 1992లో పెళ్లి చేసుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడిచాడు. ఆయన విశాఖపట్నం నగరానికి చెందిన నందినికి విడాకులు ఇచ్చి తనతో కలిసి ఓ సినిమాలో నటించిన రేణూ దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఫ్యాషన్ డిజైనర్ సోనీరాజ్‌ను ప్రకాష్ రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇకపోతే, బాలీవుడ్ పెళ్లిళ్ల గురించి చాలానే చెప్పవచ్చు. ఒకప్పుడు తన అందాలతో ప్రేక్షకులను మాయామోహితులను చేసిన రేఖ తొలుత ముఖేష్ అగర్వాల్‌ను, తర్వాత వినోద్ మెహ్రాను పెళ్లి చేసుకుంది. డ్రీమ్ గర్ల్ హేమమాలిని అప్పటికే పెళ్లయిన ప్రముఖ నటుడు ధర్మేంద్రను పెళ్లాడింది. సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్ - ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+