కెవిపి ఆంతర్యమేమిటి?

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అస్థిరంగా ఉన్న సమయంలో ఆయన వేస్తున్న అడుగులు ఏమిటి? తదితర సందేహాలు కాంగ్రెస్ నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ను వైఎస్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వేరుచేసి చూస్తున్న తరుణంలోనే వైఎస్‌పై పుస్తకావిష్కరణకు కేవీపీ సన్నద్ధం కావడం అందుకు రాష్ట్ర నేతలనెవ్వరినీ సంప్రదించకుండానే అధిష్ఠానం పెద్దలు హాజరవడం చకచకా జరిగిపోయాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడ్డాడని అందుకే వైఎస్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నమోదైందని ముఖ్యనేతలు పదే పదే చెబుతున్నారు. ఇక ఎమ్మార్ వ్యవహారంలో కెవిపి బంధువుల పేర్లు కూడా చేరాయి.
ఇలాంటి సమయంలో కెవిపి పన్నిన వ్యూహం అంతరార్థం ఏంటో తెలుసుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ను ఎంత సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. జగన్‌కు అంత మేలు చేకూరుతుందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో వైఎస్‌ను.. జగన్‌ను వేరుచేసి చూడటం సాధ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వైపు వైఎస్‌ను కీర్తిస్తూ.. మరోవైపు ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తును సమర్థిస్తూ ఎలా మాట్లాడతామని అంటున్నారు. మరోసారి పార్టీలో తన హవా పెంచుకోడానికి ఈ కార్యక్రమాన్ని కేవీపీ ఒక వేదికగా మార్చుకున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications