హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

14ఎఫ్ రద్దు వల్ల ఏమవుతుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటి నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ పేరా వివాదం పెద్ద యెత్తున కొనసాగుతోంది. అసలు 14ఎఫ్ వల్ల జరుగుతున్నదేమిటి, దాన్ని తెలంగాణవాదులు ఎందుకు వ్యతిరేకించారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతి 14ఎఫ్ పేరాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల హైదరాబాదు ఆరో జోనులోకి వస్తుంది. ఆరో జోన్‌లో హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మహబాబ్‌నగర్ జిల్లాలు ఉంటాయి. స్థానికులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజిస్తూ వెలువడ్డాయి.

ప్రభుత్వోద్యోగాల్లో, విద్యావకాశాల్లో స్థానికులకు 70 శాతం కేటాయిస్తూ, స్థానికేతరులకు 30 శాతం అవకాశం కల్పిస్తూ ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిప్రకారం కూడా హైదరాబాదు ఆరో జోన్ కిందికి వస్తుంది. అయితే, హైదరాబాదు పోలీసు చట్టం నియామకాలను జోన్లకు అతీతంగా నియామకాలు జరపడానికి హైదరాబాదు పోలీసు కమిషనర్‌కు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర రాజధాని పేరుతో ఆ మినహాయింపు ఇచ్చారు. అయితే, దాన్ని ఆసరాగా చేసుకుని సీమాంధ్రులు హైదరాబాదులో పెద్ద యెత్తున వచ్చి చేరుతున్నారని తెలంగాణవాదులు విమర్సిస్తూ వస్తున్నారు. హైదరాబాదును ఫ్రీజోన్‌గా పరిగణిస్తూ వస్తున్నారు.

స్థానికులకు అన్యాయం చేసే 14ఎఫ్ పేరాను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని తలపెట్టిన ప్రతిసారీ అడ్డంకులు వస్తున్నాయి. ఈసారి కూడా అదే అడ్డంకి వచ్చింది. ఎస్సై రాతపరీక్షలు తలపెట్టిన రోజు తెలంగాణ విద్యార్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. పరీక్షలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రపతి 14ఎఫ్ పేరాను రద్దు చేయడంతో హైదరాబాదు ఫ్రీజోన్ హోదాను కోల్పోయి, ఆరో జోన్‌లో భాగమవుతుంది.

English summary
With the scrapping of 14F para of president orders, Hyderabad will come under sixth zone and locals will get priority in jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X