Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ కుటుంబం కత్తులతోనే పుట్టింది

YS Rajasekhar Reddy
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం కత్తులతోనే పుట్టిందని వైఎస్ కుటుంబ ప్రత్యర్థి, రాజారెడ్డిని చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లాకు చెందిన పార్థసారధి ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. దీంతో ఆయన చెప్పిన విషయాలు తీవ్ర సంచలనాన్ని కలిగిస్తున్నాయి. తాను ఎవరినీ చంపలేదని, వైఎస్ తండ్రి రాజారెడ్డిని చంపించాననే వార్తలు శుద్ధ అబద్దమన్నారు. అయితే తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నన్ను వైఎస్ కుటుంబం చనిపోయిందని చెప్పారు. నాపై వారు ఆరుసార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు.

వారికి అధికారమే పరమావధి అని, అధికారానికి ఎవరు అడ్డు వచ్చినా చంపడమే వారి పని అన్నారు. మా కుటుంబానికి ప్రాణభయం ఉందని చెప్పారు. హత్యల విషయంలో మా కుటుంబ సభ్యులకి ఇప్పటికీ పెరోల్ దొరకలేదని చెప్పారు. మా తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి, పరిటాల రవి హత్య కేసులో వైఎస్ కుటుంబం హస్తం ఉందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.

మా తమ్ముడు, పరిటాల హత్య కేసును ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి దమ్ముంటే పునర్విచారణ జరిపించాలని అన్నారు. అయితే కిరణ్‌కు అంత దమ్ముందా అనే అనుమానం వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసుల అనంతరం మొద్దు శీను డైలాగులకు మంగలి కృష్ణదే స్ర్కీన్‌ప్లే అన్నారు. ఆ మంగలి కృష్ణే మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్‌కు రైట్ హ్యాండ్ అన్నారు.

సూట్‌కేసు బాంబు కుట్రలో జగన్ రైట్ హ్యాండ్ కృష్ణకు సంబంధం ఉందనే అనుమానం వెలిబుచ్చారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా నిజాన్ని అబద్దం చేయగలరు, అబద్దాన్ని నిజం చేయగలరన్నారు. సూట్ కేసు బాంబు కేసులో జగన్‌ను, కృష్ణను విచారించాలన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో కూడా వారి హ్యాండ్ ఉండి ఉంటుందన్నారు. సూరిని హత్య చేసిన భానును కూడా చంపి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో పరిటాల హత్యలో వైఎస్ కుటుంబానిది, మంగళి కృష్ణది ఉన్నది కూడా అంతే నిజమని చెప్పారు.

వైఎస్ కుటుంబానికి వ్యక్తులను వాడుకోవడం, ఆ తర్వాత వారి అవసరం తీరాక చంపివేయడం అలవాటేనన్నారు. సూరిని భాను ఒక్కడే హత్య చేయలేడన్నారు. అయితే కొన్ని హత్యలపై కిరణ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేనే ప్రైవేటు పిటిషన్ వేస్తానని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రిని త్వరలో కలుస్తానన్నారు. దగ్గరకు తీయడం, వారితో చంపించడం, తిరిగి వారినే చంపడం ఇదే వైఎస్ కుటుంబానికి తెలుసునన్నారు. వైఎస్ జగన్‌కు దమ్ముంటే గన్‌మెన్ లేకుండా కడప జిల్లాలో తిరగాలని ఆయన సవాల్ విసిరారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గింపు విషయాన్ని అడిగి పెంచమని విజ్ఞప్తి చేశాను.

అప్పుడు కొందరు అధికారులు జానారెడ్డికి విజ్ఞప్తి చేయడం వైఎస్‌కు దగ్గరివాడైన జానారెడ్డిని నమ్మకోవడం పట్ల నవ్వుకున్నారన్నారు. వైఎస్ మాట తప్పని, మడమ తిప్పని మనిషినని చెప్పుకున్నాడని, అయితే ఆయన జీవితమంతా మాట తప్పడం, మడప తిప్పడమేనన్నారు. జిల్లాలో వైఎస్ కుటుంబం ఎందరినో అణగదొక్కిందన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా అణగదొక్కిందన్నారు. కేవలం తనవారనుకున్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వంటి వారిని తప్ప వారిని నమ్మిన వారందరికీ వైఎస్ కుటుంబం అన్యాయం చేసిందన్నారు. డిఎల్‌ను ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నారు.

ఎమ్మెల్యే వీరశివారెడ్డిని చపరాసిలా చూశారన్నారు. వైఎస్ కుటుంబం గానీ, వైఎస్‌గానీ మాట మీద ఎప్పుడూ నిలబడలేదన్నారు. కరుణాకరరెడ్డి, బ్రదర్ అనీల్ కుమార్, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డిలు మాత్రమే లాభపడ్డారన్నారు. మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలతోనే విడిపోయారన్నారు. వివేకా పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారనే అనుమానం పార్థసారధిరెడ్డి వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని నమ్మించడనికే ఉన్నారన్నారు. వారిది వ్యతిరేకులను నష్టపెట్టే వ్యూహం అన్నారు. వారి విభేదాలు పక్కా ప్రణాళికాతోనే జరుగుతున్నాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+