పవార్‌తో భేటీ రద్దు: జగన్ సాక్షి ఫైర్

జగన్ లక్ష్యంగా అంటకాగుతున్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఢిల్లీలో తమ దుష్ట పన్నాగాన్ని అమలు చేశాయని వ్యాఖ్యానించింది. జగన్ సోమవారం వినతిపత్రం సమర్పించిన శరద్ పవార్ ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి కెవి థామస్, ఎఫ్‌సిఐ చైర్మన్‌లతో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పవార్ జగన్‌ను ఆహ్వానించారు. దీంతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆ సమావేశాన్ని రద్దు చేయించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రైతు సమస్యలపై ఎన్నడూ లేని విధంగా వామపక్షాలతో కలిసి తెలుగుదేశం సభ్యులు లోకసభలో స్పీకర్ మీరా కుమార్ ఆగ్రహించే స్థాయిలో ఆందోళనకు దిగడం వెనక జగన్‌తో పవార్ భేటీని అడ్డుకోవడమేనని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. నిజానికి జగన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి రావాల్సింది. కానీ పవార్‌తో భేటీతో దాన్ని వాయిదా వేసుకున్నారు. తన జన్మదినం వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనే కోరికను కూడా పక్కన పెట్టి జగన్ రైతుల కోసం ఢిల్లీలో ఉండిపోయారని సాక్షి రాసింది.












Click it and Unblock the Notifications