వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిభ చూశాం:బాబు కొడుకు లోకేష్‌కు వర్సిటీల లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh Kumar
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ చదువుకు సత్యం రామలింగ రాజు డబ్బులు పెట్టారనే ఆరోపణలకు తెరదించేందుకు తెలుగుదేశం పార్టీ గురువారం రెండు విశ్వవిద్యాలయాల లేఖలను మీడియాకు విడుదల చేసింది. కార్నెగీ మెలన్ వర్సిటీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలు లోకేష్ కుమార్‌కు లేఖలు రాశాయి. అందులో తాము డబ్బులు తీసుకొని సీట్లు ఇవ్వమని మీ ప్రతిభ ఆధారంగా సీటు ఇచ్చామని తెలిపాయి. రామలింగ రాజు భారీగా డబ్బులు ఇవ్వడం వల్లనే తనకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో అవకాశం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో లోకేష్ కుమార్ గత సంవత్సరం నవంబర్ 28న కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి లేఖ రాశారు. దీనిపై విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు లోకేష్‌కు ఆ తర్వాత తిరుగు లేఖ రాశారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం ప్రతి విద్యార్థి ప్రతిభ, నాయకత్వ లక్షణాలను పరిగణలోకి తీసుకొని సీట్లు ఇస్తుందని, ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో సీట్లు అమ్మడం అనేది ఉండదని, అలా కొనుగోలు చేసే పని ఎవరూ చేయలేరని, లోకేష్‌కు సీటు కోసం సత్యం రామలింగ రాజు అనే వ్యక్తి భారీ బహుమానం ఇచ్చారనడం అవాస్తవమని, ఆయన ఎప్పుడూ ఇస్తాననలేదు.. మేం తీసుకోలేదని లేఖలో యూనివర్సిటీ స్పష్టం చేసింది.

తాను ఎంబిఏ చదివిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి కూడా లోకేష్ లేఖ రాశారు. దీనిపై ఆ విశ్వవిద్యాలయం డీన్ గత సంవత్సరం డిసెంబర్‌లో లోకేష్‌కు లేఖ రాశారు. మీ విషయంలో అయినా మరెవరి విషయంలో అయినా అభ్యర్థుల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, అనుభవం తదితర అంశాల ఆధారంగానే సీటు ఇస్తామని, మా దగ్గర ఉన్న సీట్ల కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని లేఖలో పేర్కొన్నారు. మేం అందించే విద్యతో ప్రపంచంపై ప్రభావం చూపగల అసాధరణ ప్రతిభ ఉన్న వారినే ఎంపిక చేస్తామని, ఈ అంశాల ఆధారంగానే మీకూ ప్రవేశం ఇచ్చామని, రామలింగ రాజు బహుమానం ఇచ్చినందు వల్లే మీకు సీటు ఇచ్చామనడం అవాస్తవమని, ఈ స్పష్టమైన లేఖ మీ వ్యక్తిత్వాన్ని నిలిపేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నానంటూ లేఖలో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది.

English summary
Carnegie Mellon University and Stanford University wrote letters to TDP chief Nara Chandrababu Naidu's son Lokesh Kumar on allegations of univerity seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X