వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కని సూరీడు: జగన్ బెయిల్‌పై సిబిఐ కొలికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sureedu - YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో బెయిల్ రాకుండా చేసేందుకు సిబిఐ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడు సూరీడు (సూర్యనారాయణ రెడ్డి)ను ప్రయోగించనుంది! ఈ నెల 28న జగన్ బెయిల్ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.

సిబిఐ జగన్‌కు బెయిల్ ఇవ్వవద్దని వాదించనుంది. అందుకు సూరీడి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపయోగించుకోనుంది. ఇప్పటికే వేసిన కౌంటర్ పిటిషన్‌లో దీనిని పేర్కొంది. ఈ కేసు విషయంలో గతంలో సూరీడును విచారించినప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా చెప్పాడని, ఆ తర్వాత మాత్రం మెజిస్ట్రీట్ ముందు చెప్పేందుకు నిరాకరించాడని సుప్రీం వాదిస్తుంది. సూరీడుపై ఏవో ఒత్తిళ్లు ఉన్నందువల్లే అతను వ్యతిరేకంగా మళ్లీ చెప్పేందుకు నిరాకరించాడని, ఇలాంటి సమయంలో జగన్ బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని సిబిఐ చెబుతోంది.

సెక్షన్ 161 కింద గతంలో పోలీసు అధికారుల ఎదుట సూరీడు వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మెజిస్ట్రీట్ ముందు మాత్రం చెప్పేందుకు అతను నిరాకరించాడు. జగన్‌కు బెయిల్ ఇస్తే సూరీడు లాగే మరికొందరిని ప్రభావితం చేస్తారని సుప్రీంలో చెప్పనుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా సూరీడు అజ్ఞాతంలో ఉన్నాడని, విచారించడానికి అతని ఆచూకి దొరకడం లేదని, ఫోన్ చేసి మాట్లాడతామంటే ఫోన్ నెంబర్ కూడా మార్చారని సిబిఐ చెబుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెసు మాత్రం సూరీడును ఉపయోగించుకొని సిబిఐ జగన్‌ను టార్గెట్ చేసుకుంటుందని ఆరోపిస్తుంది.

English summary
The CBI's trump card is the withdrawal of the statement made by the personal assistant of late YS Rajasekhar Reddy, Mr.Sureedu, the CBI alleges he did so under pressure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X