వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అరెస్టుకు రెక్కీ నిర్వహించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రెక్కి నిర్వహించినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కత్రినకోన నుంచి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. విశాఖపట్నం నుంచి ఆయన హైదరాబాదుకు విమానంలో వచ్చిన సమయంలో అధికారుల కదలికలను తాము పసిగట్టినట్లు కొంత మంది చెబుతున్నారు.

రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో జగన్‌ అరెస్టుకు సిద్ధమైన అధికారులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. స్థానిక సిబిఐ అధికారుల మీద విమర్శలు వస్తుండడంతో ఢిల్లీ అధికారులు వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తును సిబిఐ దాదాపుగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో పలువురు ఐఎఎస్ అధికారులను, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారిని సిబిఐ అధికారులు విచారించారు. వైయస్ జగన్ అస్తుల కేసులో ఇప్పటి వరకు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారుట. వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు చెలరేగడంతో వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద యెత్తున హైదరాబాదులోని వైయస్ జగన్ నివాసానికి శనివారం రాత్రి, ఆదివారం ఉదయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్‌పై చేయేస్తే అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

English summary

 id the Central Bureau of Investigation or the Enforcement Directorate teams conduct a recce for the arrest of YSR Congress president Y.S. Jagan Mohan Reddy at the Rajiv Gandhi International Airport on Saturday?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X