వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ భయం: బైరెడ్డిపై చేతులు దులిపేసిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన రాయలసీమ దీక్ష ప్రభావం తన పైన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రం ఉంటే సమైక్యంగా ఉండాలి లేదంటే మూడు ముక్కలుగా చేయాలని డిమాండ్ చేస్తూ బైరెడ్డి ఈ నెల 3వ తేదిన కర్నూలులో దీక్ష ప్రారంభించారు. బైరెడ్డి దీక్ష ప్రారంభించినప్పటి నుండి విపక్షాలు బైరెడ్డి దీక్షపై బాబును తప్పు పడుతున్నాయి.

బైరెడ్డి దీక్ష వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని, తెలంగాణపై స్పష్టత ఇస్తానని ఓ వైపు చెప్పిన బాబు దానిపై స్పష్టత ఇస్తే ఎక్కడ నష్టం వాటిల్లుతుందోననే భావనతో బైరెడ్డిని తెలంగాణపై క్లారిటీ ఇవ్వకుండా ఉండేందుకు దీక్షకు దింపారని విమర్సలు చేస్తున్నారు. కాంగ్రెసు నేతలు పలువురు బైరెడ్డి దీక్షపై బాబు స్పందించాలని లేదంటే వెనుక ఆయనే ఉన్నారని భావించ వలసి వస్తుందని చెప్పారు.

బైరెడ్డి దీక్షను కాదంటే ఓ సమస్య, అవునంటే మరో సమస్య వస్తుందని భావించిన బాబు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే తెలంగాణను అడ్డుకునేందుకే బాబు బైరెడ్డిని ప్రోత్సహించారనే విమర్శల దాడి ఎక్కువ కావడంతో పార్టీకి మరింత నష్టం జరగకూడదన్న భావనతో బాబు సోమవారం పెదవి విప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి తెలంగాణలో గతంలో కంటే కొంత ప్రభావం చూపిందని, ఇలాంటి పరిస్థితుల్లో బైరెడ్డి దీక్షను సమర్థించినట్లుగా ఉన్నా, మౌనంగా ఉన్నా మళ్లీ నష్టం జరుగుతుందనే ఆందోళన బాబులో కనిపించిందని అంటున్నారు.

అందుకే ఆయన సోమవారం బైరెడ్డి దీక్షపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. సోమవారం ఉదయం బాబు మాట్లాడుతూ.. బైరెడ్డి దీక్ష వ్యక్తిగతమని, దాంతో పార్టీకి సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. బైరెడ్డి దీక్షపై స్పందించకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతోనే బాబు తప్పని పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చారని అంటున్నారు. బైరెడ్డి కూడా తన దీక్షకు పార్టీకి ఎలాంటి సందర్భం లేదని పలుమార్లు చెప్పారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has responded on party senior leader Byreddy Rajasekhar Reddy's deeksha on Monday with Telangana fear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X