మూడో ఫ్రంట్: తగ్గిన చంద్రబాబు ప్రాభవం?

రాష్ట్రపతి ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో చంద్రబాబుకు వారు భాగస్వామ్యం కల్పిండం లేదు. ఆదివారం చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టప్రతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్‌ను మరో విడత రాష్ట్రపతి పదవికి ములాయం ప్రతిపాదించారు. కానీ చంద్రబాబును సంప్రదించలేదు.
తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోయినప్పుడు ములాయం సింగ్ తదితరులతో కలిపి జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు నివాసంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు అప్పట్లో సమావేశమయ్యారు. అయితే, అది అంతగా ఫలితం ఇవ్వలేదు. వివిధ సందర్భాల్లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు యుపిఎకు వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించే కార్యక్రమాలు చేపట్టారు. దానికి కూడా చంద్రబాబును దూరంగా ఉంచారు.
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు మలుపు తిరిగాయి. కాంగ్రెసు, బిజెపియేతర పక్షాలకు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ నాయకత్వం వహించే స్థాయి వచ్చింది. దీంతో మూడు కూటమికి చెందిన రాజకీయాలు ఇప్పుడు ములాయం సింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ప్రస్తుతం వెనకబడిపోయారు.












Click it and Unblock the Notifications