కొత్త కొలికి పెడుతున్న చిరంజీవి ఎమ్మెల్యేలు

Chiranjeevi
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టే మంత్రి వర్గ విస్తరణకు చిరంజీవి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కొత్త కొలికి పెడుతున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కకుండా, విస్తరణను అడ్డుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. తమకు పదవులు దక్కవని గ్రహించిన తూర్పు గోదావరి జిల్లా ప్రజారాజ్యం శాసనసభ్యులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. తమ నేతకు పదవి లేకుండా తాము పదవులు తీసుకోబోమని, తమ నేత చిరంజీవికి పదవి దక్కిన తర్వాతనే మంత్రి పదవులు తీసుకుంటామని వారంటున్నారు. ఈ రకంగా శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుకు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు మంత్రి పదవులు దక్కకుండా ఎత్తులు వేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు ఆ వాదనను ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. చిరంజీవికి పదవి లేకుండా తాము మంత్రి పదవులు తీసుకుంటే ఆయనను అవమానించినట్లవుతుందని, త్వరలో చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో సహాయ మంత్రి పదవి లభిస్తుందని, ఆ తర్వాతనే తమ పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్గంలో చేరితే బాగుంటుందని వారంటున్నారు. తమ అసంతృప్తిని తూర్పు గోదావరి జిల్లా ప్రజారాజ్యం శాసనసభ్యులు ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం నుంచి నలుగురు శాసనసభ్యులు గెలిచారు. దీంతో మంత్రి పదవి తమ జిల్లాకు రావాలని వారంటున్నారు. తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒక్కరికి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఇద్దరికే కాంగ్రెసు అధిష్టానం పచ్చజెండా ఊపింది.

ఇద్దరికి మంత్ర పదవులు దక్కుతాయని గమనించిన మిగతా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. ఆ ఆసంతృప్తిని నేరుగా వ్యక్తం చేయకుండా చిరంజీవికి పదవి దక్కిన తర్వాత మిగతావాళ్లు పదవులు తీసుకోవాలనే వాదనను ముందుకు తెస్తున్నారు. శాసనసభ్యులు ముందు పదవులు తీసుకుంటే చిరంజీవికి పదవి ఇవ్వడంలో కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేస్తుందని వాదిస్తున్నారు. మొత్తం మీద, ఎత్తులు జిత్తులతో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ముందుకు సాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+