విభేదాలతో కెసిఆర్‌కు తెలంగాణ హీట్

కేంద్రం గానీ కాంగ్రెసు గానీ 2014 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం లేవని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. అందువల్ల 2014 ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ 70 నుంచి 80 శాసనసభా స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహరచన చేయాలని ఆయన అనుకుంటున్నారు. దానివల్ల రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తెర తీసి, తమ డిమాండును సాధించుకోవాలనేది ఆయన వ్యూహం. అయితే, తెలంగాణ జెఎసిలోని కొన్ని పక్షాలు కెసిఆర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఎన్నికల లోపు ఒత్తిడి పెంచే మార్గాలను వెతకాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ, బిజెపిలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒత్తిడి పెంచడానికి మరోసారి తెలంగాణ ఉద్యోగులు సమ్మెకు దిగే పరిస్థితి లేదు. తమ డిమాండ్ల సాధనకు, అంటే సకల జనుల సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వారు మరోమారు సమ్మెకు దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కెసిఆర్ మార్గాన్నే ఎంచుకుంటారని చెప్పక తప్పదు. తమ పార్టీకి ఓట్లు సాధించడం ద్వారా మాత్రమే తెలంగాణను సాధించుకోగలమని కెసిఆర్ కచ్చితంగానే చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణ రాజకీయ జెఎసి ప్రస్తుతం చౌరస్తాలో ఉన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications