చిరంజీవికి ఆజాద్ నుండి అప్పుడే హామీ

స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేవలం చిరంజీవి వర్గాన్నే మంత్రివర్గంలోకి తీసుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. సిఎం అధిష్టానం వద్ద పునర్వ్యవస్థీకరణకు పట్టుబట్టారు. కానీ ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. టిడిపి అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ఆదుకున్నందున చిరంజీవి సూచించిన వారికి పదవులు ఇస్తేనే బావుంటుందని అభిప్రాయపడిన అధిష్టానం ఆమేరకు ఆజాద్ వచ్చినప్పుడే హామీ ఇప్పించినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు చిరంజీవికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా అండగా ఉన్నారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. విస్తరణపై చర్చించేందుకు మంగళవారం సిఎం ఢిల్లీ వెళ్లే కంటే ముందే బొత్స ఢిల్లీ వెళ్లడం విశేషం.












Click it and Unblock the Notifications