వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ స్టాచ్యూ: బాబుతో ఫ్యామిలీ, పురంధేశ్వరి...

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari - Chandrababu Naidu
హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై కొత్త వివాదం ప్రారంభమైంది. ఎన్టీ రామరావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, భార్య లక్ష్మిపార్వతి అంగీకారాలతో సంబంధం లేకుడా ఎన్టీ రామారావు విగ్రహాన్ని స్థాపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా స్పీకర్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులంతా చంద్రబాబు వెంట ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

తమ పార్టీ అధ్యక్షుడు స్పీకర్‌కు లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నారని, దురదృష్టవశాత్తు రాజకీయ ప్రయోజనాల కోసం పురంధేశ్వరి ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. సహకరించకపోతే పురంధేశ్వరితో సంబంధం లేకుండా విగ్రహ స్థాపనకు ముందుకు సాగుతామని అంటున్నారు. అయితే, ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనలో జాప్యానికి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడిని నిందించారు.

విగ్రహ ప్రతిష్టాపనలో జాప్యం జరగడానికి చంద్రబాబు నాయుడి పార్టీయే కారణమని ఆమె ఆ మధ్య విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే విగ్రహాన్ని స్థాపించడానికి తాము ఏ మాత్రం ఆమోదించబోనని, విగ్రహాన్ని ఇచ్చే నైతిక అర్హత లేదని ఆమె అంటున్నారు. టిడిపి ఇచ్చే విగ్రహాన్ని స్థాపించడానికి తనకు అభ్యంతరం లేదని తాను స్పీకర్‌కు విడిగా లేఖ రాస్తానని లక్ష్మీపార్వతి చెబుతున్నారు.

పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం స్థాపన జరగాలనేది తన ఉద్దేశ్యమని, దాన్ని రాజకీయం చేయడం తగదని, కాంగ్రెసులో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు రాజకీయాలకు అతీతంగా పురంధేశ్వరి చూడాలని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సభ్యుల్లో కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ, జయకృష్ణ, సైయికృష్ణ, జయశంకర కృష్ణ, మోహనకృష్ణ, కూతుర్లు లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి టిడిపి స్పాన్సర్ చేసే విగ్రహానికి అంగీకరిస్తూ లేఖపై సంతకాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన వివాదం 12 ఏళ్ల నుంచి ఉంది. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అప్పటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు పార్లమెంటరీ కమిటీ ఆమోదం పొందారు. విగ్రహం కోసం అయ్యే ఖర్చులను భరించాలని కమిటీ తెలుగుదేశం పార్టీకి సూచించింది.

రాజమండ్రిలో విగ్రహాన్ని తయారు చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆ తర్వాత విగ్రహాన్ని ఎవరు ఇవ్వాలనే విషయంపై విభేదాలు పొడసూపాయి. దాంతో విగ్రహ ప్రతిష్టానం అంశం వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత 2004లో రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. అయితే, రాజకీయ కారణాలతో విగ్రహ ప్రతిష్టాపనలో ఆలస్యం జరుగుతూ వస్తోంది.

తెలుగుదేశం పార్టీకి పురంధేశ్వరి మీద పైచేయి తీసుకునే అవకాశం ఉంది. మిగతా కుటుంబ సభ్యులంతా టిడిపి విగ్రహానికి అనుమతించారు. అయితే, రాజకీయాల కారణంగా పురుంధేశ్వరిది పైచేయి అయిందని అంటున్నారు. పురంధేశ్వరి అనుమతి అవసరం లేకుండా స్పీకర్ తెలుగుదేశం విజ్ఞప్తిని అంగీకరించాల్సి ఉంటుందని అంటున్నారు.

English summary

 Amidst worsening clan-clash over installation of NTR statue on Parliament premises, Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu is all set to write a fresh letter to the Lok Sabha Speaker seeking to expedite the process even without the endorsement of the former chief minister's daughter and Union minister D Purandewsari and his wife Lakshmi Parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X