రాయల తెలంగాణ: జగన్ టార్గెట్, చిరంజీవిపై హోప్

దీంతో పార్టీ అధిష్టానం ఎపి వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలు ఉండగానే మరోవైపు ఎపిలో పార్టీ పరిస్థితిపై తీవ్ర స్థాయిలో సమాలోచనలు జరుపుతోంది. 2014 నాటికి తెలంగాణలో అద్భుతంగా పుంజుకోవడంతో పాటు.. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనీసంగానైనా ఎదుర్కొనే విధంగా వ్యూహరచన చేస్తోందని అంటున్నారు.
తెలంగాణ, రాయల తెలంగాణ, సమైక్యాంధ్ర, మూడుగా రాష్ట్ర విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం.. ఇలా పలు ప్రతిపాదనలు కాంగ్రెసు అధిష్టానం ముందు ఉన్నాయి. వాటిలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అంశంపై అధిష్టానం తీవ్ర తర్జన భర్జన పడుతోందంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణలో పుంజుకొని సీమాంధ్రలో జగన్‌ను దెబ్బ తీసే విధంగా ఉండాలని భావిస్తోన్నట్లుగా కనిపిస్తోంది.
అందులో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదన ప్రధానంగా తెరపైకి వచ్చిందని అంటున్నారు. తెలంగాణ నేతలను ఒప్పించి రాయల తెలంగాణను ప్రకటించడం ద్వారా తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నారట. జగన్ పార్టీ సీమలో కాంగ్రెసు కంటే పై చేయి సాధించినప్పటికీ తెలంగాణలో జగన్‌కు అవకాశం ఇవ్వకుండా చూడటం ద్వారా ఆయనను దెబ్బ తీయవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు.
జగన్ సీమలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటీకీ తెలంగాణను కోల్పోవడం ద్వారా ఆయనకు అధికారం దూరమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అలాగే రాయల తెలంగాణ ఇవ్వడం ద్వారా అటు రాయలసీమలోనూ కాంగ్రెసుకు బలం కాస్త పెరుగుతుందనే యోచనలో ఉందని అంటున్నారు. ఇక జగన్ బలం ఉన్న ఆంధ్రా ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ద్వారా ఆయనకు అడ్డు కట్ట వేయవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు అధిష్టానం ఎక్కువ పాళ్లు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మూడుగా విభజిస్తే సీమాంధ్రలో పార్టీ మరింత దెబ్బతింటుందనే భావనలో ఉన్నారట. అందుకే భౌగీళికంగా, చారిత్రకంగా ఏమాత్రం ప్రాతిపదిక లేని రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపనుందని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణవాదులు అంగీకరించడం లేదు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఆగస్టులోగా రాష్ట్ర విభజనపై ఓ ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. మరి ఆగస్టులోనైనా తేల్చుతారో మళ్లీ నాన్చుతారో చూడాలి.












Click it and Unblock the Notifications