వైయస్ డైరీ: కెవిపి వ్యూహం ఫలించిందా?

ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నలుగురు కేంద్ర మంత్రులు, 12 మంది రాష్ట్ర మంత్రులు, 25 మందికిపైగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధ్యక్షుడు హాజరయ్యారు. తద్వారా పార్టీలో తన పట్టు కొనసాగుతోందని కెవిపి రామచందర్ రావు నిరూపించుకున్నారని అంటున్నారు.
అధిష్ఠానం పెద్దలతోపాటు రాష్ట్రం నుంచి సగానికి పైగా మంత్రులు, తన అనుయాయులను రప్పించడం ద్వారా పార్టీలో తన ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని రుజువు ఆయన రుజువు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుతోపాటు మరికొందరు నేతలు వద్దంటున్నా మోతీలాల్ వోరా పుస్తకాన్ని ఆవిష్కరించడం, కేంద్ర మంత్రులు ఆజాద్, వయలార్ రవి, సుశీల్‌కుమార్ షిండే, రాజీవ్ శుక్లా, పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది, మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రమానికి హాజరు కావద్దంటూ వి హనుమంతరావు సహా పలువురు నేతలు ఆజాద్, ఆంటోనీ, వయలార్ రవిలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడిని తెచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదించారు. అయినా, వారి మాటలు వినకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా తాము కెవిపికి ఇస్తున్న ప్రాధ్యానం ఏమిటో చెప్పకనే చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నట్లు కెవిపి ఎక్కడా బాహాటంగా ప్రదర్శించుకోలేదు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా వంశీచంద్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన కెవిపి రాష్ట్ర రాజకీయాలను సునిశితంగా గమనిస్తున్నానన్న హెచ్చరికలు చేశారు. ఆ కార్యక్రమంలో ఎక్కడా వైయస్ ఫొటో లేకపోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆ తర్వాత దీనిపై ప్రత్యర్థులు విరుచుకుపడినా కెవిపి మాత్రం మౌనం దాల్చారు. వైయస్ పాదయాత్ర డైరీ పుస్తకావిష్కరణను మాత్రం అట్టహాసంగా చేశారు. ఆయన ప్రజా ప్రతినిధులను, ఇతర ముఖ్య నేతలను పేరుపేరునా కార్యక్రమానికి పిలిచారు. సమావేశానికి రావాలంటూ శుక్రవారం ఉదయం కూడా సెంట్రల్ హాల్లో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. అవసరమైతే తన చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ పంపిస్తానని చెప్పారు.
రాష్ట్రం నుంచి పిసిసి చీఫ్, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంత్‌కుమార్, పినిపె విశ్వరూప్, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, గల్లా అరుణ, అహ్మదుల్లా పాల్గొన్నారు. మంత్రులు గీతారెడ్డి, ప్రసాద్‌కుమార్, పితాని, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి కూడా ఢిల్లీ వస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు ఏర్పా టు చేశారు. కానీ, ఈ ముగ్గు రూ చివరి నిమిషంలో ఆగిపోయారు.
అలాగే, ఎంపీలు చిరంజీవి, ఆర్కే ధావన్, సు బ్బిరామిరెడ్డి, పొన్నం ప్రభాకర్, రత్నాభాయి, ఎంఏ ఖా న్, నంది ఎల్లయ్య, సురేశ్ షెట్కార్, సాయి ప్రతాప్, ఉం డవల్లి, రాయపాటి, జేడీ శీలం, సిరిసిల్ల రాజయ్య, కనుమూరి బాపిరాజు, కిల్లి కృపారాణి, అనంత వెంకటరెడ్డి, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యా దవ్, బల రాం నాయక్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, మందా జగన్నాథంలతోపాటు ఆర్టీసీ ఎండీ ఎం.సత్యనారాయణరావు, చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ పేర్ని నాని, శాసన మండలి విప్ శివరాం రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. కాగా, కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications