వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మినారాయణ ఫిర్యాదు: చిక్కుల్లో కెవిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

K.V.P. Ramachandra Ra - Laxmi Narayana
వంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు చిక్కుల్లో పడ్డారు. తన వియ్యంకుడు రఘురామరాజు అత్యుత్సాహం కెవిపికి కష్టాలు తెచ్చిపెట్టినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు నాయకులంతా పోరాటం నడుపుతుంటే, కెవిపి వియ్యంకుడు రఘురామరాజు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా పనిచేశారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసుపై దర్యాప్తు చేస్తున్న లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా రఘురామరాజు కాల్‌లిస్టు అందించడం కెవిపిని వ్యక్తిగతంగా, రాజకీయంగా చిక్కుల్లో పడేసిందని అంటున్నాైరు. కెవిపి వియ్యంకుడు రఘురాజుపై తాజాగా లక్ష్మీనారాయణ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కెవిపి ప్రత్యర్థులకు మంచి ఆయుధం లభించిందని అంటున్నారు. దీన్నివినియోగించుకుని వారంతా సోనియాకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

లీడ్‌ ఇండియా ప్రతినిధి చంద్రబాల, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మధ్య జరిగిన సంభాషణ, లక్ష్మీనారాయణ-మీడియా ప్రతినిధుల మధ్య వెళ్లిన ఫోన్ల వివరాలను ఒక ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీ ద్వారా గత మూడు నెలల క్రితమే తెప్పించిన కెవిపి వియ్యంకుడు రఘురాజు దాన్ని జగన్‌ వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి అందించారని, దానికి వారు మీడియాకు విడుదల చేశారన్న ఆరోపణలు వినవచ్చిన విషయం తెలిసిందే. దానికి జగన్‌ మీడియాలో క్రైంరిపోర్టర్‌గా పనిచేసే యాదగిరిరెడ్డి మరికొంత చొరవ చూపి మరింత సమాచారం తెప్పించిన వెైనం వివాదాస్పదంగా మారింది.

తమ కాల్ లిస్టు విడుదలపై ముందు చంద్రబాల, ఆ తర్వాత లక్ష్మీనారాయణ వాటిపెై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాల సైబరాబాద్‌ కమిషనర్‌కు, లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రఘురాజు పాత్రపై విచారణ చేయాలని లక్ష్మినారాయణ తన ఫిర్యాదులో ప్రధానంగా కోరారు. మొన్నటి వరకూ ఒక పారిశ్రామికవేత్తగానే భావిస్తూ వచ్చిన ఆయన స్వయంగా కెవిపి వియ్యంకుడని తేలడంతో కాంగ్రెస్‌ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

జగన్‌ కేసుల వ్యవహారంలో కెవిపి పాత్రను విచారించాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి.హన్మంతరావు, మధుయాష్కీ, హర్షకుమార్‌, మాజీ మంత్రి శంకర్‌రావు అనేకసార్లు డిమాండ్‌ చేశారు. దానిపెై తెలంగాణ ఎంపీలంతా కలసి సిబిఐకి ఫిర్యాదు చేసేందుకు సైతం ఒక దశలో సిద్ధపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అసలు కోవర్టు కెవిపి రామచంద్రరావేనని, ఆయనను సీబీఐ విచారించాలని మధుయాష్కీ అనేకసార్లు బహిరంగ విమర్శ చేశారు. వైయస్ ఆత్మను ఎందుకు వదిలేస్తున్నారని హనుమంతరావు ప్రశ్నించారు.

మరోవైపు రఘురాజు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ స్థితిలో కెవిపి ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతున్నారు. కెవిపికి కాంగ్రెసుపై ఏ మాత్రం అభిమానం ఉన్నా కాల్‌లిస్టు వ్యవహారంలో కాంగ్రెస్‌పెై జరిగిన దాడిని ఖండించేవారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాలు వినిపిస్తున్నాయి. కెవిపికి తెలియకుండా రఘురామరాజు కాల్ లిస్టులు సంపాదించేందుకు సిద్ధపడుతారా అని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నాైరు.

కాంగ్రెస్‌లోనే ఉంటూ కెవిపి జగన్‌ కోవర్టుగా పనిచేస్తున్నాడని చాలాకాలం క్రితమే చెప్పానని, ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు ఆయన వియ్యంకుడే సిబిఐ కాల్‌లిస్టును జగన్‌ పార్టీకి ఇచ్చారని లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో స్పష్టమైందని, పార్టీ ఇప్పటికయినా కళ్లు తెరవాలని హనుమంతరావు అన్నారు. తాను హైదరాబాదు వచ్చిన తర్వాత కెవిపి వ్యవహారంపై సోనియాకు ఫిర్యాదు చేస్తానని అమెరికాలో ఉన్న మధుయాష్కీ అన్నారు.

English summary

 CBI joint director V.V. Lakshminarayana on Wednesday accused a close relative of senior politician K.V.P. Ramachandra Rao and the YSR Congress of threatening him while he was handling sensitive cases including Kadapa MP Y.S. Jagan Mohan Reddy’s illegal investments case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X