• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ వర్గంలో చీలిక, ఐదుగురు వెనక్కి?

By Srinivas
|

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు చీలి పోయారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు బుజ్జగింపుల ప్రయత్నమో లేక ఉప ఎన్నికల భయమో కారణమేదైనా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లుగా సమాచారం. ఎన్ని నోటీసులైనా ఇచ్చుకోండి మేం వెనక్కి తగ్గేది లేదన్న పదిహేడు మంది ఎమ్మెల్యేల్లో కొందరు వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 10వ తేది నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఇక ఆలస్యం చేయకుండా వారిపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైపోయారు. సాధ్యమైనంత తొందరగా అనర్హత అంశం తేల్చాలని భావిస్తున్నారు. సోమవారం విచారణ కూడా ప్రారంభమైంది. అయితే కొందరు పునరాలోచనలో పడ్డట్టు మాత్రం కనిపిస్తోంది. ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళి వ్యాఖ్యలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. విప్ ధిక్కరించిన వారందరి పైనా వేటు వేయాలన్నదే తమ అభిమతమని, అదే స్పీకర్‌కు చెప్పబోతున్నామని, అయితే జగన్ వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచించుకున్నామని చెబుతున్నారని, తమను వారు సంప్రదిస్తున్నారని ఇటీవల చెప్పారు. దీంతో ఆయన సోమవారం స్పీకర్‌ను కలిసి అందరి పైన వేటు వేయమని కోరారా? ఎవరి పైన వేటు వేయమని కోరారనే అంశం తెర పైకి వచ్చింది.

కాంగ్రెసు నేతలు బుజ్జగించినప్పటికీ, ఇటీవల జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసులు వేగవంతమయ్యాయనే చెప్పవచ్చు. ఈ కేసుల విచారణ ఎంత వేగంగా ఉందో, అంతే వేగంగా అరెస్టుల పర్వం వరుసగా కొనసాగుతోంది. ఇప్పటికే కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవన్, సునీల్ రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు. విజయ సాయి రెడ్డి, సునీల్ రెడ్డిలు జగన్‌కు అత్య సన్నిహితులు. ఈ నేపథ్యంలో జగన్ ఇబ్బందులకు గురైతే తమ భవిష్యత్తు ఏమిటనే సంశయం వారిలో కలిగి ఉండవచ్చునని అందుకే వారు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. జగన్‌కు ఇబ్బందులు ఎదురైతే టిక్కెట్ల పర్వం నుండి ప్రచారం వరకు అన్ని ఇబ్బందులే ఎదురవుతాయి. అంతేకాకుండా మరో రెండేళ్లకు పైగా శాసనసభ్యత్వం ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌తో వెళ్లడం కన్నా కాంగ్రెసులో ఉండటమే బెటర్ అని భావిస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల వరకు యు-టర్న్ తీసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో అవిశ్వాసం సమయంలోనూ జగన్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారని, ఆయన ఎమ్మెల్యేలు సింగిల్ డిజిట్‌కే పరిమితమౌతారనే వార్తలు జోరుగా వినిపించినప్పటికీ ఆ తర్వాత 17 మంది విప్ ధిక్కరించారు. ఈ కారణంగా విచారణ పూర్తయ్యాక కానీ ఖచ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

English summary
It seems, five YSR Congress party chief YS Jaganmohan Reddy camp mlas may return to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X