జగన్ ట్రిక్స్: ఆ ఫ్యామిలీలో ఒకరికి, ఓ హీరోకీ టికెట్?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి సినీ గ్లామర్‌ను అద్దే ప్రయత్నాలు భారీగానే చేస్తున్నారట. ఇప్పటికే రోజా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబులు కూడా ఆ పార్టీలో చేరారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సిని గ్లామర్ బాగా అద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువు స్థానాల నుండి పలువురు సినీ ప్రముఖులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

సినీ నటి రోజు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమె చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబులు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. వారు క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు కనిపిస్తన్నారు.

మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యులకు అనకాపల్లి లేదా నర్సీపట్నం టిక్కెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. పూరీ సతీమణిని అనకాపల్లి నుండి పోటీ చేయాలించాలని జగన్ పార్టీ భావిస్తుండగా... పూరీ కుటుంబం మాత్రం ఆయన సోదరుడిని నర్సీపట్నం నుండి బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉందట.

మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుండి అదే జిల్లాకు చెందిన మోహన్ బాబు కుటుంబ సభ్యులలో ఒకరిని రంగంలోకి దింపే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం.

మోహన్‌‍బాబు ఫ్యామిలీకి జగన్ టిక్కెట్: ఓ హీరోకూ?

తాజాగా హైదరాబాద్‌లో కూడా ఒక స్థానం నుండి ఓ ప్రముఖ హీరోను రంగంలోకి దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుండి అదే జిల్లాకు చెందిన మోహన్ బాబు కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపేందుకు వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తిగా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అదే విధంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యులకు కూడా టిక్కెట్ ఇచ్చే అంశం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

పూరీ జగన్నాథ్ సోదరుడు నర్సీపట్నం అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశిస్తుండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం అనకాపల్లి పార్లమెంటు స్థానం నుండి పూరీ సతీమణిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వి.వి.వినాయక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తాజాగా మరో హీరోను హైదరాబాద్ పార్లమెంటు బరిలో దింపేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇద్దరు ప్రముఖ దర్శకులతో పాటు మోహన్ బాబు కుటుంబాన్ని సీమాంధ్ర ప్రాంతం నుండి రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ హీరోను హైదరాబాద్ బరిలో దింపే ప్రయత్నాలపై చర్చలు సాగుతున్నాయట. ఓ దర్శకుడు లేదా ఆయన కుటుంబానికి నర్సాపురం టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందట. కాగా ఇప్పటికే ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రోజా నగరి నుండి పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+