వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు మోగుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు మరింతగా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్లుగా నరేంద్ర మోడీకి గుజరాత్‌లో మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రాలేదు గానీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కుని ఘన విజయం సాధించారు. కాంగ్రెసు గతంలో కాస్తా మాత్రమే మెరుగ్గా కనిపించింది. కేశూభాయ్ పటేల్ తిరుగుబాటు బావుటా ఎగురవేసి, గుజరాత్ పరివర్తన్ పార్టీ (జిపిపి)ని ఏర్పాటు చేసి, రంగంలోకి దిగినా మోడీ హవాను అడ్డుకోలేకపోయురా.

బిజెపి ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ఇది వరకే ప్రచారంలో ఉంది. అయితే, గుజరాత్ ఫలితాలతో అది మరింత మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోద్రా సంఘటన నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఓటేస్తారనే ప్రత్యర్థుల నమ్మకాన్ని గత ఎన్నికల్లోనే మోడీ దెబ్బ తీశారు. ముచ్చటగా మూడోసారి గుజరాత్‌లో బిజెపి పతాకను ఎగురేశారు. శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ వంటి తలలు పండిన నేతలు కూడా మోడీని అడ్డుకోలేకపోయారు.

వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు ముందుకు వచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికలు మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య సమరంగా మారుతాయని జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. ఈ స్థితిలో కూడా బిజెపి తన నిర్ణయాన్ని వెల్లడించడం లేదు.

అభివృద్ధి ప్రాతిపదిక మీదనే నరేంద్ర మోడీ గుజరాత్‌లో హ్యాట్రిక్ కొట్టారనే అంచనాలు సాగుతున్నాయి. మతం వంటి ఇతర విషయాలేవీ ఎన్నికలపై ప్రభావం చూపలేదని, నరేంద్ర మోడీ అభివృద్ధికి మాత్రమే ప్రజలు ఓటేశారని అంచనాలు సాగుతున్నాయి. గుజరాత్ అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే బిజెపి మంచి ఫలితాలు సాధించవచ్చునని అంటున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాయని, అందుకే బిజెపి గుజరాత్‌లో మరోసారి గెలిచిందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అంటున్నారు. మోడీ చిత్తశుద్ధితో చేసిన పనులను ఆ రాష్ట్ర ప్రజలు ఆదరరించారని ఆయన అన్నారు. మొత్తం మీద, మోడీ దేశానికి రోల్ మోడల్ అవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
Gujarat CM Narendra Modi may emerge as BJP PM candidate strongly, with the victory of BJP in Gujarat assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X