వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణ హీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ఆశిస్తున్న సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణ సెగ తగులుతోంది. ఉస్మానియా, పాలమూరు (మహబూబ్‌నగర్), తెలంగాణ (నిజామాబాద్), మహాత్మా గాంధీ (నల్లగొండ) విశ్వవిద్యాలయాల్లోని 47 కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ అడ్మిషన్ల వ్యవహారం తెలంగాణ మలుపు తీసుకున్నాయి. సీమాంధ్ర విద్యార్థులను తెలంగాణ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాదులోని నిజాం కళాశాలలో సీమాంధ్ర విద్యార్థులను తెలంగాణ విద్యార్థులను తరిమికొట్టినట్లు వార్తలు వచ్చాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దని వంద మంది విద్యార్థులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష మంది అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 20 శాతం మంది రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి ఉన్నట్లు సమాచారం.

వెనక్కి వెళ్లిపోవాలని, లేదంటే సర్టిఫికెట్లను చించేస్తామని తెలంగాణవాదులు సీమాంధ్ర విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి), తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి), ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) అడ్మిషన్లు జరిగే స్థలాల్లో స్టాల్స్ పెట్టాయి. ఈ సంఘాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాయి.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం సీట్లు తెలంగాణేతర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత వాతావరణంతో చాలా మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రాలేదని తెలుస్తోంది. తమను బెదిరిస్తున్నట్లు, వెనక్కి పంపుతున్నట్లు తమకు ఏ విధమైన ఫిర్యాదులు రాలేదని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్యాంపస్‌లో ఉన్నంత వరకు విద్యార్థుల భద్రతకు హామీ ఇస్తున్నట్లు వారు చెబుతున్నారు. విద్యార్థులు తమంత తాముగా కౌన్సెలింగ్‌కు రాకపోతే తామేమీ చేయలేమి చెబుతున్నారు.

English summary
Even as the fervor of the Telangana agitation has died down in most universities in the region, the admission process to 47 PG courses offered by universities including Osmania, Palamuru (Mahboobnagar), Telangana (Nizamabad) and Mahatma Gandhi (Nalgonda) has taken a 'T' twist with candidates from other regions claiming that they were chased away from the counseling venue, Nizam College grounds, by 'T' supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X