జగన్ ఆస్తుల కేసు: వైయస్ పాత్ర?

జగన్ కంపెనీల లావాదేవీల వెనుక విజయ సాయి రెడ్డి ఉన్నారని తెలిపింది. 2003-04 వరకు మంచి లాభాలున్న కంపెనీలను స్వాధీనం చేసుకని తనను వెళ్లగొట్టినట్లుగా ఓ వ్యక్తి సాక్ష్యం ఇచ్చారని, నాలుగు కంపెనీల్లోని వాటాలను రూ.3 లక్షలకు వైయస్ భారతి కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నారన్నారు. 2006లో జగతి పబ్లికేషన్స్ విలువ రూ.149 కోట్లుగా విలువ కట్టగా 2009లో రూ.3400 కోట్లకు విలువ కట్టాలని విజయ సాయి రెడ్డి ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు. బోగస్ కంపెనీలు సృష్టించి వాటిలోకి ముడుపుల సొమ్మును మళ్లించి అక్కడి నుండి జగతిలోకి తరలించారన్నారు.
జగన్ కంపెనీల్లో పెట్టుబడులు రాబట్టడానికి వ్యక్తులు, కంపెనీలకు ప్రయోజనం కల్గించడం లేదంటే బెదిరించడాన్ని మార్గంగా ఎంచుకున్నారన్నారు. కోల్‌కతాలో ఉన్న కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ నివేదికలో పేర్కొన్నారని, వాటి ప్రకారం దర్యాఫ్తు జరిపితే అలాంటి కంపెనీల చిరునామాలే లేవని, తేలిందని తెలిపారు.












Click it and Unblock the Notifications