జగన్ ఆస్తుల కేసుతోనూ శ్రీలక్ష్మికి లింక్?

శ్రీలక్ష్మి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ హార్డ్ డిస్క్‌లో బాక్సైట్ వ్యవహారానికి సంబంధించిన సమాచారమంతా లభించినట్లు చెబుతున్నారు. మరోవైపు బాక్సైట్ నిక్షేపాల కేటాయింపునకు సంబంధించిన పత్రాలను, ఉత్తర్వులను ప్రభుత్వ అధికారుల నుంచి సిబిఐ తెప్పించుకుని అధ్యయనం చేస్తోంది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం జిర్రెల ప్రాంతంలో దాదాపు 224 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలను రన్ ఆల్ ఖైమా, దాని స్థానిక సహాయకుడికి కలిపి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రస్ ఆల్ ఖైమా స్థానిక సహాయకుడి పేరుతో పెన్నా ప్రతాప రెడ్డి ఈ విషయంలో ప్రయోజనం పొందినట్లు చెబుతున్నారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత అన్‌రాక్ అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థలో మొదట పెన్నా ప్రతాప రెడ్డికి చెందిన వ్యక్తులు చేరారని, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలంలో 1500 ఎకరాలకు పైగా రైతులనుంచి బలవంతంగా భూములను సేకరించిన తర్వాత ఆ సంస్థ బోర్డులో ప్రతాప రెడ్డి చేరారని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందమంతా లోపభూయిష్టంగా ఉందని, ఇందుకు శ్రీలక్ష్మి కారణమని సిబిఐ భావించి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications