నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tamil Nadu Express fire: Survivors say they heard cracker blast
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-11 బోగిలో ప్రమాదం పేలుడు కారణంగానే జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి ముందు పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ లేదా విద్రోహ చర్య కావొచ్చుననే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు. అయితే కొందరు ప్రయాణీకులు ఇప్పటికే ప్రమాదానికి ముందు శబ్ధం వినపడిందని సోమవారమే చెప్పారు. తాజాగా మంగళవారం కూడా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న వివరాలు కూడా పేలుడు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలకు మరింత బీజం పడుతోంది.

ప్రమాదానికి ముందు ఎస్-11 బోగీలో మూడుసార్లు పేలుడు శబ్దాలు విన్నామని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని వారు అంటున్నారు. ఆ తర్వాతే పొగ వ్యాపించిందంటున్నారు. పుకార్లు నమ్మవద్దని పోలీసులు, రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మాత్రం పేలుడు జరిగినట్లుగా ఉండటం గమనార్హం. అదే బోగీలో ప్రమాదం నుండి బయటపడ్డ వారు కూడా తాము 40-44 బెర్తుల మధ్య బాణసంచా పేలిన శబ్ధం విన్నామని రైల్వే పోలీసులకు చెప్పారు.

ప్రయాణీకులు తెలిపిన వివరాల ప్రకారం... పవర్ ఫెయిల్యూర్‌కు ముందే ప్రమాదం కోచ్ మొత్తం వ్యాపించిందని, వెంటనే కంపార్టుమెంట్ అంతా పొగ వ్యాపించిందని చెప్పారు. ప్రకాశ్ సింగ్ అనే 51 ఏళ్ల వ్యక్తి తాను 33వ బెర్తులో పడుకొని ఉండగా.. ట్యూబ్ లైట్ పేలిన శబ్ధం వినిపించిందని, దాంతో తాను తన బెర్త్ నుండి కిందకు దూకానని, తన పైన కొందరు ప్రయాణీకులు దూకారని చెప్పాడు.

అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేక పోతున్నారు. విచారణ తర్వాతనే ఏదైనా చెబుతామంటున్నారు. మంగళవారం ఉదయం బోగీని ఫోరెనిక్స్ బోగీని పరిశీలించారు. నమూనాలు సేకరించారు. వీరు నివేదికను రైల్వే శాఖకు ఇవ్వనున్నారు.

English summary
Survivors of the fire mishap in the ill-fated S11 compartment of the Tamil Nadu Express told investigators that they had heard the sound of firecrackers going off inside the coach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X