వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న గళం: ధోనీ కెప్టెన్సీకి ముప్పు?

By Pratap
|
Google Oneindia TeluguNews

MS Dhoni
న్యూఢిల్లీ: కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి ముప్పు తప్పేట్లు లేదు. పాకిస్తాన్‌తో సిరీస్ తర్వాతనో, ఆ తర్వాతి ఇంగ్లాండు పర్యటన పూర్తయిన తర్వాతనో అతనికి ఉద్వాసన తప్పదనే మాట వినిపిస్తోంది. ధోనీ కెప్టెన్సీపై పూర్తిగా నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. పాకిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచును ఓడిన తర్వాత మరింతగా వ్యతిరేకత చవి చూడాల్సి వచ్చింది. అతనికి వ్యతిరేకంగా మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు వరుస దాడులు చేయవచ్చు. ఇప్పటికే సునీల్ గవాస్కర్ గొంత విప్పాడు. పైగా, బిసిసిఐ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా కెప్టెన్ ధోనీపై ఒత్తిడి తగ్గించడం కోసం టెస్టు జట్టు పగ్గాలు మరొకరి అప్పగించాలన్న డిమాండ్లు త్వరలో నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ధోనీ కెప్టెన్సీ భవితవ్యం సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ధోనీకి ఈ మేరకు హెచ్చరికలు పంపినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాజయం అనంతరం ధోనీ సారథ్యం పట్ల సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెప్పారు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ధోనీ కెప్టెన్‌గా కొనసాగాలంటే, పాక్‌తో జరుగుతున్న టి-20, వన్డే సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలని సెలెక్టర్లు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇక 2015లో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రణాళికలను సిద్ధంగా చేయాల్సిందిగా మహేంద్ర సింగ్ ధోనీకి ఆదేశాలు పంపినట్టు సమాచారం.

నేరుగా అన్ని ఫార్మాట్ల నుంచి తొలగించకుండా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు సూత్రాన్ని అమలులోకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. విరాట్ కోహ్లీ, సురేష్ రైనా పేర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వినిపిస్తున్నాయి. వచ్చే ప్రపంచ కప్ పోటీలకు జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మెరుగైన ఆటగాళ్లను చూసుకోవాల్సి ఉంటుంది. వరుస వైఫల్యాలతో కూడా జట్టులో కొసాగుతున్న వారికి స్వస్తి చెప్పక తప్పదేమో..

కెప్టెన్‌గా ధోనీ బాగా అలసిపోయాడని, అతనికి కొంతకాలం విశ్రాంతి అవసరమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ విరామంలో యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఛాన్సిస్తే జ ట్టులో నూతనోత్తేజం నింపుతాడన్నాడు. 'ధోనీ మూడు ఫార్మాట్లనుంచీ తాత్కాలికంగా తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలి. 2015 వరల్డ్‌కప్ ఇంకా చాలా దూరముంది కాబట్టి దానిగురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇప్పటికిప్పుడు సిరీస్ మధ్యలో కాకున్నా..2013లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందో లేదా తర్వాతో ధోనీ తప్పుకుంటే మంచిది. విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగిస్తే జట్టుకు యువోత్సాహం వస్తుంది' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

English summary

 It is said that BCCI may take into consideration of changing captaincy. Mahendra Singh Dhoni is facing the threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X