వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుపై బాబు భరద్వాజ్‌ను కలిశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొత్త వివాదానికి తెర లేపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ నాయకులు టార్గెట్ చేసుకోవడం కొత్తేమీ కాకపోయినప్పటికీ తాజాగా మరో వివాదానికి తెర లేపి, ఇరకాటంలో పెట్టే పనికి పూనుకున్నారు. చంద్రబాబు ఇటీవల కుప్పం వెళ్తూ బెంగుళార్‌లో కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌ను కలుసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తన ఆస్తుల కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు భరద్వాజ్‌తో సంప్రదింపులు జరిపారని వారు ఆరోపించారు. గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ మంత్రాంగం నెరపగలరనే దీమాతో చంద్రబాబు అందుకు పూనుకున్నారని చెప్పారు. ఈనాడు అధినేత నారా రామోజీ రావు, చంద్రబాబు, రిలయన్స్ కలిసి విచారణల నుంచి తప్పించుకునేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచిందని వారు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిసినట్లు ఆరోపణలు చేసి సాక్షి దినపత్రిక పెద్ద దుమారాన్నే రేపింది. తాజాగా, భరద్వాజ్ కలిసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తుండగా, చంద్రబాబుకే కాంగ్రెసు చెలిమిని అంటగట్టే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. అందులో భాగంగానే - రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతామని చంద్రబాబు, రామోజీ రావు ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చిటన్లు కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న తెలుగేతర ఈటీవి చానెళ్లను రిలయన్స్ కొనుగోలు చేయడంలో మతలబు ఉందని, చంద్రబాబు సూచన మేరకే రిలయన్స్ రామోజీ టీవీ చానెళ్లను కొనుగోలు చేసిందని వారన్నారు.

మొత్తం మీద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య రాజకీయ పోరాటమే కాకుండా న్యాయపరమైన పోరాటంలో పరస్పరం పైచేయి సాధించే వ్యూహాల అమలు కూడా కొనసాగుతోంది.

English summary
YSR Congress leaders Konathala Ramakrishna and Casireddy Padma alleged that TDP president N Chandrababu Naidu has met HR Bharadwaj to escape from inquiries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X