Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎర్రన్న: బాబు చెప్పింది అక్షరాల నిజమే!

Chandrababu Naidu-Yerram Naidu
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి చెందిన విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. కాసేపు తేరుకోలేక పోయారు. ఆ తర్వాత శ్రీకాకుళంకు బయలుదేరిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన కుడిభుజం పోయిందన్నారు. నిమ్మాడలో ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించిన తర్వాత కూడా బాబు అదే మాట చెప్పారు.

రాజకీయాలను నిత్యం ఫాలో అవుతున్న వారైనా, సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ఎవరైనా బాబు చెప్పినట్లుగానే టిడిపికి ఎర్రన్నాయుడు ఖచ్చితంగా కుడిభుజమే అని చెబుతారు! స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఇరవై ఆరేళ్ల వయస్సులోనే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎర్రన్నాయుడు ఆ తర్వాత టిడిపి కోసం ఎంతో పాటుపడ్డారు. ఎన్టీఆర్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా ఆయన టిడిపి కోసం చిత్తశుద్ధితో పని చేశారు.

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన పార్టీ కోసమే పని చేశారు. ఎన్టీఆర్ హయాంలో యువకుడిగా ఉన్న ఎర్రన్నాయుడు పార్టీలో కీలక పాత్ర పోషించినప్పటికీ చంద్రబాబు హయాంలో ఆయన పేరు బాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలో ఆయన అందరికీ తలలో నాలుకలా ఉండేవారని పార్టీ నేతలు చెబుతుంటారు. పార్టీ కోసం, పార్టీ అధినేత పట్ల ఎప్పుడూ విశ్వాసంగా ఉండేవారని చెబుతున్నారు.

సాధారణంగా పార్టీ నిర్ణయాలు నచ్చకుంటే ఇటీవలి కాలంలో మీడియాకు ఎక్కడం, పార్టీలు మారటం సహజంగా జరుగుతుంది. కానీ ఎర్రన్నాయుడు ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చకుంటే అధినేతకు చెప్పడమో లేదా పార్టీ సమావేశంలో లేవనెత్తడమో మాత్రమే చేసేవారని, కానీ బయటకు మాత్రం చెప్పే వారు కాదని గుర్తుకు చేసుకుంటున్నారు. బాబు చెప్పినట్లుగా ఆయన బాబుకు, టిడిపికి కుడిభుజం.

కేవలం ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఆయన పార్టీకి పెద్ద ఎసెట్. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఎర్రన్నాయుడిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవని చెబుతుంటారు. కష్టమైనా సుఖమైనా పార్టీలో ఎర్రన్నాయుడిని ఖచ్చితంగా సంప్రదించేవారు. పార్టీలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ ఆయన పాత్ర ఉండేదని చెబుతున్నారు.

తెలంగాణ అయినా, బిసి డిక్లరేషన్ అయినా ఎర్రన్నాయుడి నిర్ణయం కావాల్సిందే అంటున్నారు. పలువురు నేతలు కూడా ఎర్రన్నాయుడు సూచనలను తూచ తప్పకుండా పాటించేవారట. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెబుతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై పార్టీ తరఫున ఎవరు కేసులు వేయాలన్న చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంచుకున్న మొదటి పేరు ఎర్రన్నాయుడిదే అని చెబుతున్నారు.

పార్టీ కోసం తప్ప స్వార్థ రాజకీయాలు చేయలేదంటున్నారు. 1989లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన ఎర్రన్నాయుడు కొద్దికాలానికే ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. సాధారణంగా స్వతంత్ర సభ్యులు అధికార పక్షం వైపుకు వెళ్తారు. కానీ ఎన్టీఆర్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన పైన అభిమానం, పార్టీ ఉన్న పట్ల అంకితభావంతో ఆయన టిడిపి వైపే మొగ్గు చూపారని గుర్తు చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాత్రపై నిర్ణయం తీసుకున్న వారిలో ఎర్రన్నాయుడు కూడా ముఖ్యులు. బాబు పాదయాత్ర చేస్తుండగా దానిని సమీక్షించి, బాబుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చే వారట. బాబు చెప్పింది అక్షరాల నిజమేనని, ఆయనకు, పార్టీకి కుడి భుజం కోల్పోయామని టిడిపి నేతలు రోదిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+