ఐఏఎస్‌ల వెనుక జగన్, మాజీ సలహాదారు?

సిబిఐ ఎదుట హాజరైన సమయంలో తన పేరు చెబితే అసలుకే ఎసరు వస్తుందన్న ముందస్తు వ్యూహంతో నాటి సలహాదారు వీరిని ప్రధానంగా రంగంలోకి దించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టైలిష్ హోం రంగారావు ఆయన పాత్రను సిబిఐ ఎదుట వెల్లడించారు. ఇలాంటి సమయంలో మరికొందరు ఐఏఎస్‌లు నోరు విప్పక ముందే ప్రభుత్వంపై ఎదురు దాడికి ఐఏఎస్‌లకు రంగంలోకి ఆయన దింపి ఉంటారని అంటున్నారు. ఈ వ్యవహారంతో సిబిఐ, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విచారణలో వేగం తగ్గడం ద్వారా తాము బయటపడవచ్చునని వారు భావిస్తున్నారట. అయితే ఆయన జగన్‌తో కలిసి చేస్తున్నారా లేక వేరుగా చేస్తున్నారా అనే అంశం తేలడం లేదట. ఇందులో రాజకీయ కోణం దాగి ఉండటం వల్లనే పలువురు ఐఏఎస్‌లు సిఎంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. శుక్రవారం సిఎంకు ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేయగానే కేంద్ర ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశాన్ని ఆరా తీసిందట.
అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని కొందరు అధికారులు వ్యాఖ్యానించడం, మంత్రులను విడిచిపెట్టి తమను వేధించడం ఏమిటని నిలదీసిన వైనం గమనించిన నిఘావర్గాలు ఆ దిశగా ఆరా తీశాయట. జగన్‌తో పాటు, సలహాదారు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు నివేదిక కూడా ఇచ్చాయట. అదే సమయంలో వైయస్ హయాంలోని కొందరు మంత్రుల హస్తం కూడా ఇందులో ఉందని తేలిందని సమాచారం. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంతో పాటు, ప్రభుత్వానికి - అధికారులకు దూరం పెంచి రానున్న ఎన్నికల్లో కాంగ్రెసును దెబ్బతీసేందుకే జగన్ ఈ పథకం రచించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో రాజకీయ కోణం ఉండటం వల్లనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి వాదనకు మద్దతివ్వలేదనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications