కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రచారంలో జగన్ దూకుడు, చిరు సీటుపైనా కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహంతో వెళుతున్నారు. త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అయితే ఉప ఎన్నికల దూకుడులో జగన్ టిడిపి, కాంగ్రెసు కంటే ముందున్నారు. ఆ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. తన వర్గానికి చెందినవారి 17 సీట్లపైనే కాకుండా చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతి సీటుపైనా జగన్ కన్నేశారు.

అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల నేతలు తలమునకలయ్యారు. జగన్ పార్టీ అభ్యర్థులుగా రాజీనామా చేసిన వారే బరిలోకి దిగనున్నారు. జగన్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లేదు. దీంతో ఆయన అప్పుడే తన ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఉప ఎన్నికలు జరగనున్న కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. రైతులు, పేదల కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన తన వర్గం నేతలను గెలిపించాలని ఆయన ప్రచారంలో కోరుతున్నారు.

ఆయన ప్రచార పర్యటన వ్యూహాత్మకంగా ఉందని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగానే అన్ని నియోజకవర్గాలలో రెండేసిసార్లు పర్యటించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. తన పట్ల, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల అభిమానం ఉన్నప్పటికీ కొత్తగా వచ్చిన తన పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి భారీ మెజార్టీతో తన అభ్యర్థులను గెలిపించుకోవాలంటే నోటిఫికేషన్‌కు ముందు నుండే జాగ్రత్త పడాలని ఆయన భావిస్తున్నారట. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జగన్ పర్యటనలతో మరింత బిజీ బిజీగా గడపనున్నారట.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ పద్దెనిమిది స్థానాల ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈ స్థానాల్లో ఆయన తన అభ్యర్థులను గెలిపించుకోకపోతే రాజకీయంగా ఆయన సమస్య ఎదుర్కోవడం ఖాయం. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో జగన్, వైయస్ విజయమ్మ గెలుపొందినప్పటికీ స్థానికం అని అంటున్నారు. కొవూరు ఒకే నియోజకవర్గం కాబట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో గెలిచారనే వాదనలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు జగన్‌కు రాజకీయంగా జీవన్మరణ సమస్య కానున్నాయి.

రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి జూన్‌లో లేదా ఆగస్టులో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. ఆగస్టులో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్ గురువారం చెప్పారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy is campaigning 18 assembly segments, going to be held bypolls in August. He planned to round all the constituencies two times before election notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X