పేలుళ్లు: అడుగడుగున కెమెరా కళ్లు

ఇక నుండి బహుళ అంతస్తుల యజమానులూ సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందే. జంట పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. నగరం మొత్తం నిఘా పెడతామని చెప్పారు.
ఆరు నెలల్లోనే ఈ పని పూర్తవుతుందని చెప్పారు. బహుళ అంతస్థుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చట్టం తీసుకు రానున్నారు. మునిసిపాలిటీ, పోలీసు శాఖ సమన్వయంతో ఇప్పటికే ఉన్న పెద్ద భవనాల యజమానులకు నోటీసులిచ్చి కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సిసి కెమెరాలు నగరంలో విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. సినిమా థియేటర్లు, మాల్స్‌లు, ఆసుపత్రులు, భవన సముదాయాల్లో సిసి కెమెరాలు ఇక నుండి తప్పనిసరి చేయనున్నారు.












Click it and Unblock the Notifications