వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టు కోసం బ్రదర్ అనిల్ కుమార్ పాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Anil kumar
హైదరాబాద్: పట్టు కోసం బ్రదర్ అనిల్ కుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు వర్గాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం దాంతో మరో మలుపు తిరుగుతోంది. క్రైస్తవులు, దళిత క్రైస్తవులపై బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే పట్టు సాధించారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గట్టి పట్టు సాధించిన ఆయన దూకుడుకు కాంగ్రెస్‌ ముకుతాడు వేయడానికి కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అనిల్‌ మరో కొత్త వ్యూహానికి తెరలేపారని వార్తలు వచ్చాయి.

అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ మత పెద్దలను హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పిలిపిస్తున్నారు. వారి ద్వారా మరోసారి తన పట్టు నిలబెట్టుకుని, తనపై వస్తున్న ఆరోపణలు అభూతకల్పనలేనని చాటడం ద్వారా వారి మద్దతు కూడగట్టుకునే వ్యూహానికి పదునుపెట్టారని చెబుతున్నారు. ప్రత్యర్థి వర్గం అనిల్ కుమార్‌పై కత్తులు నూరుతోంది.

క్రైస్తవాన్ని భ్రష్ఠుపట్టిస్తున్న అనిల్‌ కుటుంబాన్ని మతం నుంచి బహిష్కరించాలే తప్ప, ఆ సమావేశానికి వెళ్లవద్దని ఆయనను, వైయస్ కుటుంబాన్ని వ్యతిరేకిస్తోన్న క్రైస్తవ సంఘం పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది. గత ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ విజయానికి, జగన్‌ ఓదార్పు, షర్మిల పాదయాత్ర విజయవంతంలో క్రైస్తవులే కీలకపాత్ర పోషించారని కాంగ్రెసు అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో అనిల్ కుమార్ ప్రాబల్యాన్ని దెబ్బ తీసి క్రైస్తవులను బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తోందని అంటున్నారు.

తనకు వ్యతిరేకంగా చాపకింద నీరులా సాగిస్తున్న ప్రచారం వల్ల వచ్చే ప్రమాదం కని పెట్టిన బ్రదర్‌ అనిల్‌ జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, వర్ల రామయ్య వంటినేతలు తన అక్రమాస్తులు, వీర భద్రారెడ్డి వ్యవహారం, మణికొండలో భూ కబ్జా వంటి ఆరోపణలతో క్రైస్తవుల్లో తనపై వ్యతిరేక భావన బలపడేలా చేస్తున్న ప్రమాదాన్ని అనిల్‌ కనిపెట్టారు.

రాష్ట్రంలోని మత పెద్దలను శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌కు పిలిపిస్తున్నారు. తనబలం పెంచుకునే క్రమంలో అనిల్‌ చేస్తున్న ఈ యత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి. అయితే, అనిల్‌ నిర్వహించే సమావే శానికి హాజరుకావ ద్దని, క్రైస్తవాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతు న్న అనిల్‌ను నిలదీయ వలసిన బాధ్యత మత పెద్దలపై ఉందని తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య కన్వీనర్‌ జెరూసెలం మత్తయ్య వ్యాఖ్యానించారు.

English summary

 YSR Congress leaders Sharmila's husband brother Anil kumar is trying to consolidate his power among Christion by talking with Christian elders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X