వైయస్ జగన్ కేసు: మరింతగా బిగిస్తున్న ఉచ్చు

ఇదంతా పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం కావడంతో వైయస్ జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆర్వోసి సహకారం అవసరమని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీంతో ఆర్వోసి జగన్ సంస్థల్లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడులపై, అందుకు గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించినట్లు చెబుతున్నారు.
లాభాలు వస్తాయనే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టలేదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే జగన్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేశారని ఆర్వోసి నివేదిక స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తాము చేస్తున్న వ్యాపారాలతో సంబంధం లేకుండా ఈ పెట్టుబడులు పెట్టారని తెలిపినట్లు సమాచారం.
హెటిరో డ్రగ్స్‌పైనే కాకుండా ఇతర సంస్థలపై కూడా ఆర్వోసి దర్యాప్తు జరిపి నివేదికలు రూపొందించినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. ఆ నివేదికలను తమకు సమర్పించాలని సిబిఐ కోరిందని అంటున్నారు. ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జి హబ్‌లతో పాటు కోల్‌కతా సూట్‌కేసు కంపెనీలపైనా సిబిఐ దర్యాప్తు జరిపింది. వాటిపై ఆర్వోసి రూపొందించిన నివేదిక కూడా అందితే కేసు మరింత పటిష్టమవుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications