వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై బాస్ పైచేయి: లోకేష్ ఫుల్‌టైం పాలిటిక్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Nara Lokesh
తన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014లో తిరిగి అధికారంలోకి వస్తారని నారా లోకేష్ అన్నారు. లోకేష్ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని.. అయితే పార్టీ పోటీ చేయాలని నిర్ణయిస్తే బరిలోకి దిగుతానని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఎలాంటి సమస్య వచ్చినా బాస్(చంద్రబాబు) ఎదుర్కొని టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తారన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తదితర సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారన్నారు. బ్రెజిల్‌లో చూసిన అనంతరం తాను 2009 ఎన్నికల సమయంలో నగదు బదలీ పథకాన్ని రూపొందించానని, యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోందని, అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను తీర్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రస్తుతం తాను హెరిటేజ్ వ్యవహారాలను చూడటంతో పాటు పార్టీ పైన దృష్టి సారిస్తున్నానన్నారు.

వచ్చే జూన్ నుండి తాను రాజకీయాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేస్తున్న తన సతీమణి బ్రాహ్మిణి తిరిగి వచ్చి హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటారని, ఆ తర్వాత తాను రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తానన్నారు. అయినా తనకు రాజకీయాలు కొత్తేమీ కాదన్నారు. తన తండ్రి తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తాను చిన్నప్పటి నుండి రాజకీయ వాతావరణంలో పెరిగానన్నారు.

హెరిటేజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను నిత్యం తన కంపెనీకి సంబంధించిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటానని, సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేస్తానన్నారు. ప్రస్తుతం తాను పార్టీలో క్రియాశీలక కార్యకర్తనని, అయితే ఇప్పటి వరకు తాను పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టలేదన్నారు. కానీ కొన్ని ప్రసార సాధనాలలో తనకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఓ కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయన్నారు.

తన ఇంటికి, హెరిటేజ్ కార్యాలయానికి వచ్చే టిడిపి కార్యకర్తలతో, నాయకులతో తాను నిత్యం మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. అందరితో మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. పార్టీ యూత్ వింగ్‌ను లీడ్ చేయాలనే కోరిక తనకు లేదని కానీ, యువతను సమాయత్తం చేయాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోందన్నారు.

ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తుంటే కేవలం ఇరవై వేల మంది విద్యార్థులకు మాత్రం రూ.20వేల రూపాయల ఉద్యోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత కోసం తాము కొత్త పాలసీని తీసుకు వస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం, శేరిలింగపల్లి.. రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని లోకేష్ కొట్టి పారేశారు.

కుప్పం, శేరిలింగంపల్లిల నుండి బాబు పోటీ చేసి శేరిలింగంపల్లిలో గెలిచిన తర్వాత కుప్పంకు రాజీనామా చేస్తారని, అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తాననే ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు పోటీ చేయాలని ఉంటే నేరుగా బాస్(చంద్రబాబు)ను టిక్కెట్ అడుగుతానని, కానీ తనకు పోటీ చేయాలనే ఆసక్తి లేదన్నారు. పార్టీలో చేరగానే పదవులు కావాలంటే కష్టమన్నారు. కొద్దిరోజులు పార్టీ కోసం పని చేయాల్సిందేనన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్లాన్ తనకు ఇప్పటి వరకైతే లేదన్నారు. పార్టీ నిర్ణయిస్తే అప్పుడు వేరుగా ఉంటుందన్నారు. ఓ మెరిట్ విద్యార్థి పేదరికం కారణంగా చదువును ఆపేయాలని చెబితే తాను ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వెళ్లానని, అతను వెంటనే ప్రతిభ పేరుతో మెరిట్ స్కాలర్‌షిప్ పథకానికి ఓకె చెప్పారన్నారు. నగదు బదలీ పథకాన్ని టిడిపి 2009లో ప్రకటించినప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో సహా అందరూ వ్యతిరేకించారని, ఇప్పుడు అదే కాంగ్రెసు పార్టీ దానిని ఇంప్లిమెంట్ చేస్తోందన్నారు.

English summary
Nara Lokesh, son of Telugudesam chief Nara Chandrababu Naidu, says that he is not interested in contesting the 2014 elections but like a typical politician, adds that he will contest if the party decides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X