పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లు సంభవించిన చోట్లకు, క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు రాజకీయ నేతల తాకిడి పెరిగింది. సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ నేతల తాకిడి సాగుతూనే ఉన్నది.

తాజాగా, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు పేలుళ్లు సంభవించిన ప్రదేశాలను శనివారం ఉదయం సందర్శించారు. జంట పేలుళ్లను పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. వ్యవస్థను కూల్చడానికి ఉగ్రవాదులు ఆటవిక చర్యలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. సిసి కెమెరాలు పని చేయకపోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన కమల, యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆయన వెంట బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, ఎన్ ఇంద్రసేనా రెడ్డి ఉన్నారు.

శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఆ తర్వాత ఆస్పత్రులకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు సమాచార పౌరసంబంధాల మంత్రి డికె అరుణ కూడా క్షతగాత్రులను పరామర్సించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాదుకు హుటాహుటిన వచ్చేసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి కూడా సందర్శించారు.

పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు దిల్‌షుక్‌నగర్‌లో బాంబులు పేలిన ప్రదేశాలను సందర్శించారు. ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.

పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం బాంబులు పేలన స్థలాలను సందర్శించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

దామోదర రాజనర్సింహ క్షతగాత్రులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

పేలుళ్లు: అయిపోయాక నేతల తాకిడి ఇలా...

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల మంత్రి డికె అరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+