ప్రజాకోర్టులో తెలంగాణ జెఏసికి రిటైర్డ్ జడ్జి ఝలక్

Kodandaram
ఈ నెల 14న జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమం అరెస్టు పైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి శనివారం ప్రజా కోర్టును నిర్వహించింది. ఈ ప్రజా కోర్టులో ఓ రిటైర్డ్ జడ్జి ఐకాసకు షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రజా కోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ ఇస్మాయిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే తనకు వేరే పని ఉందని చెప్పి వెళ్లారు. అంతకుముందు ఆయన స్పందిస్తూ బాధితుల పరిస్థితు చూస్తుంటే దయనీయంగానే ఉందని, మాన హక్కుల ఉల్లంఘన కనబడుతోందని అన్నారు. అయితే, ఇక్కడ ఒక పక్షమే వచ్చి తమ వాదన చెబుతోందని, రెండవ పక్షం వాదన వినకుండా తీర్పు చెప్పలేమన్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు దారుణంగా వ్యవహరించారని, యుద్ధంలో కూడా అలా ప్రవర్తించరని కోదండరామ్ ప్రజా కోర్టు సందర్భంగా వ్యాఖ్యానించారు. నిరసన లేకపోతే ప్రజాస్వామ్యం లేదని, చలో అసెంబ్లీ రోజున తనకు ఎదురైన అనుభవాలను కోదండరాం వివరించారు. ఈ నెల 14న నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం.. మొదటిదీ కాదు.. చివరిదీ కాబోదు అన్నారు.

తాము శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తామని చెబితే.. హింసకు పాల్పడతామంటూ ఊహాజనిత వాదనను పోలీసులు వినిపించారని, అనుమతి నిరాకరించినట్లు లిఖిత పూర్వకంగా తెలియజేయకుండా అక్రమ నిర్బంధాన్ని కొనసాగించారని అన్నారు. యుద్ధంలో శత్రువులను చుట్టుముట్టినట్లు మోహరించి కొట్టారని, శరీరభాగాలను మెలిపెట్టారన్నారు. మర్మాంగాలపైనా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.

అసెంబ్లీకి వెళ్లి ప్రజాప్రతినిధులతో మాట్లాడదామని అనుకుంటే, అనుమతి ఇవ్వలేదని దుయ్యబట్టారు. జెఏసి స్టీరింగ్ కమిటీ సభ్యులందరి ఫోన్లను ప్రభుత్వం ట్యాప్‌చేస్తోందని ఆరోపించారు. ప్రజా కోర్టు ఇచ్చే నివేదిక వృధా పోదని, ఇది కోర్టులు, అంతర్జాతీయ సమాజానికి చేరుతుందని చెప్పారు. చలో అసెంబ్లీ రోజున శాసన సభ సాక్షిగా ఎమ్మెల్యేల హక్కుల ఉల్లంఘన జరిగిందని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు విమర్శించారు.

అయితే 'చలో అసెంబ్లీ' నిర్బంధంపై కేవలం ఒక వైపు వాదనలు విని తీర్పు చెప్పలేమని, ఇది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్ అన్నారు. దీనిపై మానవహక్కుల కమిషన్‌ను సంప్రదించాలని జెఏసికి సూచించి, వెళ్లిపోయారు. ప్రభుత్వం, పోలీసులు తప్పు చేసినట్లు బాహ్య ప్రపంచానికి చాటడమే ప్రజా కోర్టు ఉద్దేశమని మాడభూషి శ్రీధర్ తెలిపారు. ప్రజాకోర్టు వేదికగా ఒక లేఖను ప్రభుత్వానికి, పోలీసులకు పంపుతామని టంకశాల అశోక్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+