వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్తే.. మీఇష్టం!: తెలంగాణ కంట్రోల్‌పై సిఎం హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Sonia Gandhi
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కిరణ్ సోమవారం బిజీ బిజీగా గడిపారు. పరువురు పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు నివేదికను వారి ముందుంచారు. జగన్ పార్టీని ఎదుర్కొనే వ్యూహంపై చర్చించారు.

అదే సమయంలో తెలంగాణ పైనా అధిష్టానానికి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కష్టమేనని చెప్పారట. తాను తెలంగాణ ఉద్యమాన్ని కంట్రోల్ చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లుగా ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చినా, సమైక్యాంధ్ర అని చెప్పినా కథ మొదటికి వస్తుందని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. పరిష్కారంలో ఎన్నో చిక్కుముళ్లు ఉన్నాయని చెప్పారట.

ఎలాంటి ప్రకటన చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో అనేక కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారట. పార్టీ పరిస్థితి దెబ్బ తినలేదని, సెంటిమెంట్ ఇన్నాళ్లు పని చేసిందని, క్రమంగా అది తగ్గిందని, అందుకు సహకార ఎన్నికలే నిదర్శనం అని చెప్పారు. పక్కా ప్రణాళికతో వెళ్తే ఎన్నికల్లో గెలవడం కష్టమేమీ కాదని అధిష్టానం పెద్దలకు సూచించారట. అలాగే మాజీ మంత్రి శంకర రావు, మజ్లస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీల అరెస్టులపై వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీని కిరణ్ సోమవారం రాత్రి ఆయన నివాసంలో కలుసుకుని దాదాపు అరగంటపాటు చర్చలు జరిపారు. ఉపాధ్యక్షుడుగా ఎంపికైనందుకు కిరణ్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తెలంగాణ సమస్యపై రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. సహకార ఎన్నికల్లో పార్టీ విజయం గురించి సిఎంప్రస్తావించినప్పుడు రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలపై త్వరలో విశదంగా చర్చిస్తామని రాహుల్ కిరణ్‌కు చెప్పినట్లు తెలిసింది.

కాగా, సోమవారం రాత్రి హైదరాబాదు బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కిరణ్ ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం ఆయన సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలుసుకున్న తర్వాత మంగళవారం ఆయన హైదరాబాద్ తిరిగి రానున్నారు.

English summary

 CM Kiran Kumar Reddy on Monday had a series of meeting with Congress core committee members including party president Sonia Gandhi in New Delhi wherin he gave his views on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X