వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూలర్: జగన్‌కు 'సింహాసన' యోగం లేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతారా? అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అవుతారా? అనే అంశాలపై ఆసక్తిక చర్చ సాగుతుండగా.. ఉగాది పర్వదినం సందర్భంగా పండితులు మాత్రం తమ తమ పంచాంగ శ్రవణాల్లో భిన్నమైన జోస్యాలు చెప్పారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి బయటకు రావడమే కాకుండా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారని జగన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రవణంలో పండితులు చెప్పారు. జగన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలోను కీలకంగా మారుతారని చెప్పారు.

కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారముందని చెప్పారు. అయితే, జగన్ పార్టీ కార్యాలయంలో రామచంద్ర శాస్త్రి చెప్పిన శ్రవణానికి ఇతరులు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. జగన్ కింగ్ అయ్యే పరిస్థితి లేదని, కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు.

జగన్ పార్టీ కార్యాలయంలో శ్రవణం వినిపించిన శాస్త్రి 230 సీట్లు వస్తాయని చెబితే.. మరికొందరు మాత్రం 60-70 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. లోకసభ ఎన్నికల్లోను 12-18 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. జగన్‌‍కు సింహాసన యోగం లేదని, అధికారం కోసం ఆయన ఫైట్ చేయక తప్పదని మరికొందరు శాస్త్రులు చెబుతున్నారు. రూలర్ అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు.

English summary
If what astrologers have predicted on the auspicious occasion of Ugadi on Thursday turns out to be true, the YSR Congress supremo, Y.S. Jaganmohan Reddy will not only be out of jail very shortly, but his party would also sweep the next Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X