వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేసి పార్లమెంటుకు: వారు మౌనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Resigned MPs attend Parliament: Ministers calm
న్యూఢిల్లీ: పార్లమెంటులో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు నినాదాలు చేయడంపై స్పీకర్ మీరా కుమార్ మండిపడ్డారు. అసలు రాజీనామా చేసిన ఎంపీలు తిరిగి సభకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. స్పీకర్ మీరా కుమార్ ఎంపీలను వారిస్తున్నప్పటికీ తమకు న్యాయం చేయాలంటూ ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళాన్ని నిండు సభలో వినిపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సభలో స్పీకర్ మీరా కుమార్ పోడియను చుట్టి ముట్టి జై సమైక్యాంధ్ర, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర సభ్యుల నినాదాలతో సభను తొలుత అర్థ గంట వాయిదా వేసిన మీరా కుమార్.. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయగా, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు.

అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా తమకేమీ పట్టనట్లు కూర్చున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, తదితరులు గొడవ గురించి తమకేమీ పట్టనట్లు మౌనంగా కూర్చున్నారు.

English summary
Loksabha speaker Meira kumar questioned the Seemandhra MPs, who resigned attended the Parliament session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X