జగన్ కేసు!: సబితా రెడ్డి రాజకీయ వైరాగ్యం

కిరణ్‌తో భేటీ వివరాలను తెలుసుకునేందుకు ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి తెలుసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు... ఆమె రాజకీయాల్లోకి వచ్చిందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారట. తాను రాజకీయాలలోకి రాకముందు ఇంట్లో నాలుగు గోడల మధ్య గృహిణిగా ఎంతో ఆనందంగా జీవించానని, ఇప్పుడు ఎందుకు రాజకీయ రొంపిలోకి దిగానా అని మదనపడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారట. మళ్లీ తాను నాటి అమాయకపు పల్లెటూరి పిల్లనైతే బాగుండునని చెప్పారట.
సబితా ఇంద్రా రెడ్డి తన భర్త మృతి చెందాక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావడంపై మథనపడుతున్నారట. మరోవైపు జగన్ కేసులో సిబిఐ తనపై మోపిన అభియోగాలను న్యాయపోరాటం చేసి తన నిజాయితీని నిరూపించకుంటానని, అంతకు మించి తనకు గత్యంతరం లేదని ఆమె చెప్పారట. తన సహచర మంత్రి ధర్మాన ప్రసాద రావు పైన పిసి యాక్డును ప్రయోగించేందుకు సిబిఐకి అవరోధం కలిగిన నాడే తమపై నేరుగా ఈ సెక్షన్‌ను ప్రయోగిస్తారని ఊహించామని చెప్పారట.
అందువల్ల తమపై పిసి యాక్టు ప్రయోగం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని అయితే, రాజకీయాల్లోకి వచ్చినందుకు ఇప్పుడు తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నానని ఆమె చెప్పారట. సికింద్రాబాదు శాసనసభ్యురాలు జయసుధ కూడా ఇటీవల రాజకీయాల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications